వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తుంటారో అందరికీ తెలిసిందే. ఎంతటి వ్యక్తులైనా సరే ట్రాఫిక్ నిబంధనలు పాటించే విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. సామాన్యుల తరహాలోనే ప్రజా ప్రతినిధులు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే, తాజాగా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ కారు రాంగ్ రూట్‌లో వచ్చింది.
మంత్రి కారు ఇలా రాంగ్ రూట్‌లో వచ్చినా ట్రాఫిక్ పోలీసు మాత్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. రాంగ్‌రూట్‌లో వస్తున్న మంత్రి కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్‌ఐ అడ్డుకున్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా శనివారం మెహెదీపట్నం సమీపంలోని బాపూఘాట్ వద్ద నివాళులర్పించేందుకు కేటీఆర్ వచ్చారు. ఆ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ అడ్డుకున్న సమయంలో కారులో మంత్రి లేరు. ఘాట్ వద్ద బాపూజీకి నివాళులు అర్పించేందుకు గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అక్కడికి వచ్చారు. వారికి కేటీఆర్ వీడ్కోలు పలుకుతుండగా మంత్రి వెళ్లేందుకు.. కారు అక్కడికి తీసుకురావాలంటూ డ్రైవర్‌కు పార్టీ నేతలు సూచించారు. ఇద్దరు గవర్నర్లు అక్కడి నుంచి వెళుతుండటంతో ఓ వైపు రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో మంత్రి కారు రాంగ్‌రూట్‌లో రావాల్సి వచ్చింది.
Also Read: పోలీసులతో వాగ్వాదం.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ ఛార్జ్.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నిరుద్యోగ సైరన్
ఈ విషయం అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ ఐలయ్య గమనించి.. కారును ఆపి బానెట్ మీద చరిచారు. రాంగ్ రూట్‌లో ఎందుకు వస్తున్నావు? వెనక్కి వెళ్లు? అని డ్రైవర్‌కు ట్రాఫిక్ ఎస్‌ఐ సూచించారు. అది మంత్రి వాహనం అని అక్కడే ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పడంతో అప్పుడు ఎస్‌ఐ వెనక్కి తగ్గారు. అయితే కారును ఆపడాన్ని చూసిన టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు ఉన్నతాధికారులు సర్దిచెప్పడంతో శాంతించారు. మంత్రి కారని గుర్తించకపోవడం వల్లే ఎస్‌ఐ ఆపారని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Also Read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
దీనిపై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విధి నిర్వహణలో పోలీసు సక్రమంగా వ్యవహరించారని పలువురు కామెంట్ చేశారు. రాంగ్ రూట్‌లో వచ్చిన వాహనానికి ఎందుకు జరిమానా వేయలేదని మరికొంత మంది ప్రశ్నించారు. మంత్రి కారయితే నిబంధనలు వర్తించవా? అని కామెంట్లు చేశారు.
Also Read: NIMS: మీకు కరోనా సోకి తగ్గిందా? జాగ్రత్త.. ఈ కొత్త సమస్య రావొచ్చు, నిమ్స్‌లో ఆరుగురి చేరిక..
Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం