విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి(ఈఎన్‌సీ) చెందిన జెట్టీలోకి బంగ్లాదేశ్‌కు చెందిన నౌక ‘బీఎన్‌ఎస్‌ సముద్ర అవిజన్‌’ చేరుకుంది. ఇండో- పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్‌వర్ష్‌ వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్‌లో అయిదు రోజుల పాటు పర్యటించి... ఇక్కడి నౌకాదళంతో కలుస్తుందని.. నేవీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌ జాతీయ నేత బహదూర్‌ షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి స్మారకంగా భారత్‌ నేవీతో వృత్తిపరమైన మమేకం, క్రాస్‌డెక్‌ వంటి అంశాలతో భాగస్వామ్యం కానుందని స్పష్టం చేశాయి. తొలుత జెట్టీ వద్ద నౌకకు భారత్‌ నేవీ బ్యాండుతో సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఈఎన్‌సీ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌తో బంగ్లాదేశ్‌ నౌక సీవో భేటీ అయ్యారు.  బీఎన్ఎస్ సముద్ర అవిజన్ బంగ్లాదేశ్ నావికాదళంలో రెండో అతిపెద్ద నౌక. సముద్ర అవిజన్, సముద్ర జాయ్ అక్కడ రెండు అతిపెద్ద నౌకలు.





సముద్ర అవిజాన్ 2015 13 నుంచి 16 నవంబర్ లో యూఎస్ నుంచి బంగ్లాదేశ్ వస్తున్న ఈ నౌక ఫిలిప్పీన్స్, మనీలా పోర్టును సందర్శించింది. ఆ టైమ్ లోనే మలేషియాను కూడా సందర్శించింది. ఈ నౌక 28 నవంబర్ 2015 న బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌కు చేరుకుంది. 19 మార్చి 2016 న బంగ్లాదేశ్ నావికాదళంలో చేరింది.


ఐదు దశాబ్దాల క్రితం భారత్-పాక్ యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. గతంలో బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్మారక స్తూపం వద్ద విజయ జ్యోతిని.. వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్, సుచరిత ఉంచారు.  1971లో పాక్‌పై జరిగిన యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత నౌకాదళ అధికారులు కూడా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుని అతిథులంతా నివాళులర్పించారు. నేవీ అధికారులు విశాఖలోని పాఠశాలలకు కూడా విజయ జ్యోతిని తీసుకెళ్లి... కిశోర బాలబాలికల్లో ఆనాటి విజయ స్ఫూర్తిని అవగాహన కల్పించారు.


Also Read: Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి