మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ‘నాన్-లోకల్’ అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ‘మా’ సభ్యులు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ‘మా’లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటులు మోహన్ బాబు తొలిసారి స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 


ప్రకాష్ రాజ్‌తో గొడవలు?: ప్రకాష్ రాజ్‌తో నాకు గొడవలేవీ లేవు. తాను ఎక్కడ కనిపించినా.. అన్నయ్య బాగున్నారా అని పలకరిస్తారు. ఈ ఎన్నికల్లో విష్ణు తప్పకుండా విజయం సాధిస్తాడు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత.. ‘మా’ భవనం కట్టించి మాట నిలబెట్టుకుంటాడు. అయితే, ‘మా’ ఎన్నికల్లో జయసుధ మద్దతు మాకే ఉంటుందని భావించాం. దాదాపు అంతా అదే అనుకున్నారు. కానీ, ఆమె అవతలి ప్యానెల్‌కు మద్దతు ఇచ్చారు. అది ఆమె వ్యక్తిగత విషయం. 


చిరంజీవి ఎప్పటికీ స్నేహితుడే: చిరంజీవి ఇప్పటికీ ఎప్పటికీ నా స్నేహితుడే. ‘మా’ ఎన్నికల వల్ల మా మధ్య దూరం పెరగలేదు. మెగా ఫ్యామిలీ వారసులు, అల్లు అరవింద్ కుమారుల్లో ఎవరైనా సరే ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉంటే మంచు విష్ణును పోటీలో నిలబెట్టేవాడిని కాదు. విత్‌డ్రా చేసుకోమని చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్లు కూడా నా బిడ్డల్లాంటివారే. కానీ, ఇప్పటికే సమయం మించిపోయింది. 


కన్నీళ్లు ఆగలేదు: ఇటీవల నేను, రజనీకాంత్‌.. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిశాం. ఆయన నన్ను చూడగానే.. ఇతను మంచి వ్యక్తి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని చెప్పారు. ఆ మాటలు విని నాకు కన్నీళ్లు ఆగలేదు. విష్ణుకు మద్దతు కోసం నేను స్వయంగా 800 మంది సభ్యులతో ఫోన్లో మాట్లాడాను.- విష్ణు కూడా 600 మందితో మాట్లాడారు. కొంతమందిని స్వయంగా కలిసి మద్దతు కోరుతున్నాడు. తప్పకుండా విష్ణు విజయం సాధిస్తాడు. 


Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్


సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు: ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు. దాసరి నారాయణరావుతోనే ఆ పెద్దరికం పోయింది. ప్రస్తుతం ఎవరైనా సినీ పెద్దలుగా భావిస్తున్నారేమో నాకు తెలీదు. దానిపై నేను పెద్దగా మాట్లాడను. మళ్లీ లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించాను. నాకు సరిపడే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. 


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి