తెలంగామలో తమ ప్రాంతాలను విలీనం చేయాలని మహారాష్ట్ర , కర్ణాటకలోని శివారు ప్రాంతాల ప్రజల డిమాండ్లు అంతకంతూ పెరుగుతున్నాయి. నేరుగా అక్కడి ప్రజాప్రతినిధులే ఈ డిమాండ్లు చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో ఉండే కర్ణాటక జిల్లా రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. అక్కడి ఎమ్మెల్యేది కూడా అదే అభిప్రాయం. రాయచూర్‌కు బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ స్సయలు పరిష్కారం కావడం లేదని తెలంగాణలో విలీనం అవ్వాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రజలకు కూడా ఈ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. ఈ వీడియోను టీఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ రీ ట్వీట్ చేసి.. ఖ్యాతి సరిహద్దులు దాటిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 


 Validation for Telangana coming from across the border; Karnataka BJP MLA says Raichur should be merged in Telangana & the audience welcomes the suggestion with applause 👏 https://t.co/wdPUP3tfGs





Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !


రాయచూర్ బెంగళూరుకు దూరంగా.. హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటుంది. రాయచూర్ ప్రజలంతా ఏ పని మీదైనా హైదరాబాద్‌కే వస్తూంటారు. అదే సమయంలో అక్కడ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కూడా అంతంతమాత్రమే. ఎమ్మెల్యే నాగరాజ్ అదే అభిప్రాయాన్ని వినిపించారు. హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు.


Also Read : హుజూరాబాద్ లో ఉత్కంఠ... ఈటల రాజేందర్ పై కేసు నమోదు... బరిలో నలుగురు ఈ రాజేందర్ లు


తెలంగామకు మహారాష్ట్రతోనూ సరిహద్దులు ఉన్నాయి. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహించి అక్కడి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును కూడా కలిశారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు వారిని బాగా ఆకట్టుకున్నాయి. పథకాలు పొందేందుకు వీలుగా తమ తాలుకాలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలంటూ నాందేడ్‌ జిల్లాలో తరచూ ప్రదర్శనలు..  జరుగుతూనే ఉంటాయి. 


Also Read : "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?


భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోక మందు నైజంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు భాగంగా ఉండేవి.  అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయిన తర్వాత నిజాం సంస్థానంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రాలో.. కన్నడ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు.  అయితే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి తక్కువగా ఉండటం.. పథకాలు అందకపోతూండటంతో వారంతా తెలంగాణలో కవాలని అనుకుంటున్నారు. 


Watch Video : టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి హరీష్ రావు‌కి షాక్ ... ఏం జరిగిందో చూడండి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి