రాజకీయ పార్టీలు నడపడం అంటే చిన్న విషయం కాదు. కోట్లలోనే ఖర్చు ఉంటుంది. అనధికారికంగా పెట్టే దాని గురించి పక్కన పెడితే అదికారికంగా పెట్టాల్సిన ఖర్చే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలు పూర్తిగా విరాళాల మీద ఆధారపడాల్సిందే. అలాంటి విరాళాలు పొందడంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంతో ముందు ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి. జాతీయ పార్టీల సంగతి పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలకూ దండిగానే విరాళాలు వస్తున్నాయి.
Also Read : హుజూరాబాద్ లో ఉత్కంఠ... ఈటల రాజేందర్ పై కేసు నమోదు... బరిలో నలుగురు ఈ రాజేందర్ లు
గుర్తింపు పొందిన 42 ప్రాంతీయ పార్టీలకు 2019-20లో రూ.877.95 కోట్ల విరాళాల ఆదాయం వచ్చింది. ఈ పార్టీల్లో నెంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.130.46 కోట్ల ఆదాయం టీఆర్ఎస్‌కు వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర అధికార పక్షంలో ప్రధాన భాగస్వామి అయిన శివసేనకు రూ.111.4 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.92.7 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. ఈ మూడు పార్టీలకే దాదాపుగా 40శాతం నిధులు వెళ్లాయి.
Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్
ఆదాయం పొందడంలోనే అగ్రగామిగా ఉంటున్న పార్టీలు ఖర్చు విషయంలో మాత్రం పసినారితనంతో వ్యవహరి్సతున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి తనకు వచ్చిన ఆదాంయలో కేవలం 16.24 శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది. మిగిలిన అంతా బ్యాంక్ అకౌంట్లలోనే భత్రంగా ఉంచుకుంది. అయితే చాలా పార్టీలు వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. అలాంటి పార్టీల జాబిాతలో టీడీపీ ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. డీఎంకే, బీజేడీ, సమాద్‌వాదీ, జేడీఎస్ తదితర పార్టీలు కూడా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశారు.
Also Read: కేసీఆర్ పీఠం కూలుస్తా... టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడను... ఈటల రాజేందర్ ఫైర్
2017లో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టారు. ఎస్‌బీఐ రూ.1000, రూ.10,000, లక్షా, 10 లక్షలు, ఒక కోటి రూపాయాల డినామినేషన్‌లో విక్రయిస్తుంది. విరాళాలు ఇచ్చే వారు తమకు నచ్చిన పార్టీ పేరు మీద ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు లేదా విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లలో భాగంగా విరాళాలు ఎవరు ఇస్తున్నారు..? అనేది గోప్యంగా ఉంటుంది. అందుకే ఈ ఎలక్టోరల్ బాండ్లపై అనేక విమర్శలు ఉన్నాయి. ఎక్కువగా అధికార పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వస్తూటాయి. బీజేపీకి మొత్తం విరాళాల్లో 80 శాతం వరకూ అందుతూ ఉంటాయి.
"మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?