అమితాబ్ తను అంగీకరించిన ప్రకటన సరైంది కాదని తెలుసుకున్నారా...అభిమానుల అభిప్రాయాన్ని గౌరవించారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఓ పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకున్నారు. దాన్నుంచి తప్పుకోవడమే కాదు కాంట్రాక్టు రద్దుచేసుకుని వాళ్లిచ్చిన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేశారు. ఇవి సరోగేట్ యాడ్స్ అని తెలియదని, తెలిశాక తప్పుకోవడమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని బిగ్ బీ టీమ్ చెబుతోంది.
పాన్ మసాలా బ్రాండ్లకు ప్రకటనకర్తగా వ్యవహరించవద్దని ఇటీవల ఎన్‌ఓటీఈ అనే పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు అభిమానులు కూడా ఇలాంటి ప్రకటనల్లో బిగ్ బీ కనిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిల్లర సొమ్ము అవసరమా అని నేరుగా కామెంట్ చేశారు. ఇప్పుడు వెనక్కు తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ మసాలా యాడ్ నుంచి అమితాబ్ తప్పుకోవడంతో ఇప్పుడందరి చూపూ మహేష్ బాబుపై పడింది. అలాంటి వ్యాపార ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏమిటంటని మహేష్ బాబు ని కూడా అభిమానులు అడిగారు. అయితే మహేశ్ నటించింది ' పాన్ మసాలా' ప్రకటన కాదు 'పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్' యాడ్. మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్ నటించిన పాన్ బహార్ పొగాకు ఉత్పత్తి. ఆ ప్రకటన చూసిన వారికి ఈ విషయం అర్థంకాదు..అదే మార్కెటింగ్ స్ట్రాటజీ .
Also Read: 'కండబలం, డబ్బు బలానికి లొంగిపోయారు' నాగబాబు ఓపెన్ లెటర్..
సరోగేట్ ప్రకటనలు అంటే..
ప్రభుత్వం సిగరెట్లు, మద్యం, గుట్కా తదితర యాడ్స్‌ను నిషేధించింది. ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు, పత్రిక ప్రకటనలు, టీవీ యాడ్స్ ఏరకమైన ప్రచారమైనా నిషిద్దం. ప్రజల ఆరోగ్యానికి హానిచేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయొద్దన్నది ఆ నిర్ణయంలోని ఆంతర్యం. అందుకే ఆయా కంపెనీలు డొంకతిరుగుడు పద్ధతిలో బ్రాండ్ ప్రమోషన్ చేపడతాయి. గుట్టాను నేరుగా ప్రమోట్ చేయకుండా పాన్ మసాలా , వక్కపొడి అంటూ ప్రచారం చేస్తారు. అమితాబ్ మాత్రమే కాదు, చాలామంది ఈ పాన్ మసాలా ప్రకటనల్లో నటించారు. బిగ్ బీ తన అభిప్రాయం మార్చుకుని రెమ్యనరేషన్ తిరిగిచ్చేశారు..మరి మహేశ్ బాబు ఏం చేస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read: నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి