హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. అభ్యర్థుల విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ నేతలు, ప్రత్యర్థులకు మధ్య మాటల యుద్ధం సాగించింది. ఈ ఉత్కంఠలో మరో సంఘటన జరిగింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహించారని ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈటల రాజేందర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. 


మొత్తం 61 నామినేషన్లు


హుజూరాబాద్‌, బద్వేల్ ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. హుజూరాబాద్ లో మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజు(ఆదివారం) 46 మంది నామినేషన్లు సమర్పించారు. ఏపీలోని బద్వేల్‌లో కూడా నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. పరిశీలన తర్వాత 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. 


నలుగురు ఈ రాజేందర్ లు నామినేషన్లు 


తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేస్తుంటారు. హుజూరాబాద్ లో రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున రాజేందర్‌ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరంతో మొదలవుతోంది. ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్‌ నేతలు ఈ నామినేషన్లు వేయించారని బీజేపీ ఆరోపించింది. 


Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్


ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం


హుజూరాబాద్ లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 13 మంది, ఇండిపెండెంట్లు 43 మంది మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పరిశీలన అనంతరం మొత్తం 43 మంది బరిలో నిలిచినట్లు తెలిపారు. 18 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు టీఆర్ఎస్‌ నుంచి గెల్లు శ్రీనినాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరపున బల్మూరు వెంకట్ నామినేషన్లు ఆమోదం పొందాయి. 


Also Read: హుజురాబాద్‌లో 61 మంది నామినేషన్లు ... ప్రధాన పార్టీల మధ్యే పోరు


బద్వేల్ బరిలో 18 మంది


ఏపీలోని బద్వేల్‌ నియోజకవర్గంలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 9 నామినేషన్లను ఎన్నికల అధికారి తిరిస్కరించారు. ఈ బైపోల్ లో మొత్తం 27 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేశారు. వైఎస్సార్సీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధ, బీజేపీ నుంచి సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీలో నిలిచారు. ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, ఆ తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తేలనుంది.

 


 


Also Read:  కేసీఆర్ పీఠం కూలుస్తా... టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడను... ఈటల రాజేందర్ ఫైర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి