హుజురాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా... అందులో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరీ వెంకటనర్సింగ రావుతో పాటు పలువురు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్‌ ధాఖలు చేశారు. చివరిరోజు నామినేషన్ కేంద్రం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్స్ హల్ చల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వయంగా సీపీ సత్యనారాయణ రంగంలోకి దిగారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు శుక్రవారంతో ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13 వరకూ ఉపసంహరణ గడువు ఉంటుంది. నిరుద్యోగులు, ఉపాధి హమీ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు కానీ వారికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. 









Also Read : కాంగ్రెస్‌కు చేత కాలేదు.. మేం చేసి చూపిస్తున్నాం ! అసెంబ్లీలో కేసీఆర్ మార్క్ స్పీచ్ !


బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చివరి రోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హుజురాబాద్ వచ్చారు. డమ్మీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ సందర్భంగా బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్‌లో ముదిరాజ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌కు సవాల్ చేశారు. అక్రమాలను ఎదిరించే బిడ్డగా ఉంటానన్నారు. పోలీసులను నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నానని... కేసీఆర్‌ను తెలంగాణ సమాజంలో దోషిగా నిలబెడతామని ప్రకటించారు.  


 


Also Read : ‘మా’కు మోడీకి ఏంటి సంబంధం ? ‘అతి’ స్థాయికి చేరిన తారల ఎన్నికల రగడ !


ముదిరాజులను కదిలిస్తే తేనె తుట్టెను కదిలించినట్టేనని హెచ్చరించారు. అన్ని కులాలు, మతాల వారు తనకు మద్దతు తెలుపుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.  చెకురుక్షేత్రంలో యోధానుయోధులు కౌరవుల వైపు ఉన్నా, ధర్మం పాండవుల వైపు ఉన్న కారణంగా వారు గెలిచారన్నారు, ఇప్పుడు కూడా ధర్మం వైపు ఉన్న మనం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు తనంతట తాను రాజీనామా చేయలేదని.. వాళ్ళు డిమాండ్ చేస్తే రాజీనామా చేశానన్నారు. 






Also Read : హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్


మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  కేసీఆర్‌ను గద్దె దించాలంటే విద్యార్థులు, యువత కీలక భూమిక పోషించాలని భావించే విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చామని ప్రకటించారు. మోడీ, కేడీలు కలసి దోచుకున్నారని.. కేసీఆర్, రాజేందర్‌ల వద్ద ఉన్నట్టుగా తమ దగ్గర డబ్బులు లేవని.. అమ్ముడుపోయిన నాయకులను కసబ్ అని పిలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. 


Also Read : కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు


కేసీఆర్ పక్కలో బల్లెంలా తయారయ్యే బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని ఓటర్లను రేవంత్కోరారు. మొన్నటి ఎన్నికల్లో బండికి, గుండుకు ఓటు వేశారని వారు చేసిందేమీ లేదని గుర్తు చేశారు.  ఈటల రాజేందర్, హరీష్ రావుల మధ్య రాజకీయ విభేదాలు తప్పా వ్యాపార లావాదేవీలు అలాగే ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బిడ్డను బిర్లాను చేసి, కొడుకును టాటాను చేశాడని.. హుజురాబాద్‌లో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని రేవంత్ ప్రజలను కోరారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన గత శుక్రవారమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.  


Also Read : అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేటీఆర్‌ను కలిసిన రఘునందన్, ఏం మాట్లాడుకున్నారంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి