అక్కినేని నాగచైతన్య-సమంత మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఎందుకు విడిపోతున్నారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో చైతు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా తరచూ పోస్ట్ లు, స్టేటస్ లు పెడుతోంది. ఈరోజు ఉదయాన్నే.. మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం, మగాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదంటూ నిలదీసింది. ఇక తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. 


Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్


ముందుగా.. తనపై వస్తోన్న అబద్ధపు ప్రచారాలను, తప్పుడు కథనాలను నమ్మకుండా తనకు సపోర్ట్ చేస్తూ.. సానుభూతి, ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్పింది సమంత. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలను వద్దనుకున్నానని.. అవకాశవాదినని అన్నారని.. ఇప్పుడేమో అబార్షన్స్ కూడా జరిగాయని అంటున్నారని మండిపడింది. విడాకులు అనేది చాలా బాధనిస్తుందని.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండని కోరింది. తనపై పర్సనల్ ఎటాక్ చేస్తూ.. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇవేవీ కూడా నన్ను బ్రేక్ చేయలేవని మీకు ప్రామిస్ చేస్తున్నా అంటూ రాసుకొచ్చింది. 


దీనిపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ముందుగా రకుల్ లవ్ సింబల్ తో పాటు స్ట్రెంగ్త్ సింబల్ ను పోస్ట్ చేసింది. అభిమానులు ఎప్పుడూ మీతోనే ఉంటారని.. రూమర్స్ ను పట్టించుకోవద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఇలా తన అభిప్రాయాన్ని చెప్పడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా తనపై తప్పుడు కథనాలు రాకుండా ఆగుతాయేమో చూడాలి. ఇక ఈ బాధ నుంచి బయటపడడానికి సమంత కెరీర్ పరంగా బిజీ అయిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలను అంగీకరిస్తుంది. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో సినిమా ఒప్పుకున్న ఆమె.. మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ రానున్నాయి.