వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మరోసారి పెరిగాయి. పండుగ నాడు సైతం వాహనదారులకు ధరల సమస్య తీరడం లేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌పై 35 పైసలు పెరగగా, డీజిల్ పై సైతం అంతే పెరిగింది. ఢిల్లీలో నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.105.14 కాగా, డీజిల్ ధర రూ.93.87 గా ఉంది.


హైదరాబాద్‌లో నేడు ధరలు పెరిగిపోతున్నాయి.. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.109.37 అయింది. డీజిల్ ధర ప్రస్తుతం రూ.102.42కి చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.57 పైసలు పెరిగి రూ.109.09గా ఉంది. డీజిల్ ధర రూ.38 పైసలు పెరిగి రూ.102.15 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.53 పైసలు పెరిగి రూ.109.70గా ఉంది. డీజిల్ ధర రూ.54 పైసలు పెరిగి రూ.102.72 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగి రూ.110.30 గా ఉంది. డీజిల్ ధర రూ.0.18 పైసలు పెరిగి రూ.103.19 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


Also Read: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ! 


ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా పెరిగిన ధరలు..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు దసరా నాడు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర రూ. 56 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.111.08 గా ఉంది.. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.112.04కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.99గా ఉంది. గత ధరతో పోలిస్తే 81 పైసలు పుంజుకుంది. డీజిల్ ధర 78 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో లీటర్ రూ.103.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం 35 పైసలు పెరిగి.. రూ.111.97 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.104.33 అయింది. డీజిల్ ధర లీటరుకు 36 పైసలు పెరిగింది.


Also Read: ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..


గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 14 నాటి ధరల ప్రకారం 80.14 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి