దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి తీవ్ర స్థాయిలో మందగించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఏపీలో పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం జగన్ ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.


Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !


అలా చేస్తే 1600 మెగావాట్లు
దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని కొనుగోలు చేసేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సూచించారు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంటు, వీటీపీఎస్‌లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, వాటి ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చని సీఎం ఆదేశించారు.


Also Read : రాజకీయ విమర్శలపై ప్రతిపక్షాలు, మీడియాకు ఏపీ డీజీపీ పరువు నష్టం నోటీసులు ! దేశంలోనే మొదటి సారి !


తెలంగాణలో సింగరేణితో కూడా మాట్లాడుకొని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎక్కడా విద్యుత్‌ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 


మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. బొగ్గు కొరతపై ఇప్పటికే సీఎం జగన్ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మాత్రం బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని, ఆందోళన అవసరం లేదని చెబుతోంది.


Also Read: Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి