రోజూ కప్పు పెరుగు తింటే ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు మంచి పోషకాహారం. ఇందులో విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు శరీరాన్ని అనేక రకాల వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. పెరుగులో ఉండే ప్రోబయటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని రక్షించడంలో ముందుంటాయి. ఇవి పేగుల్లోని చెడు బ్యాక్టిరియాలను తొలగించి, మంచి బ్యాక్టిరియాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. అందుకే రోజు పెరుగు తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే పెరుగుతో పాటూ కొన్ని రకాల ఆహారపదార్థాలు తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందడంతో పాటూ, ఆరోగ్యమూ మెరుగుతుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు దాడి చేసే అవకాశం తగ్గుతుంది. 


1. పెరుగు - డ్రై ఫ్రూట్స్
పెరుగుతో పాటూ జీడిపప్పులు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఈ రెండు ఒకే సమయంలో తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నీరసంగా ఉన్నప్పుడు తింటే శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. ఇన్ స్టాంట్ ఎనర్జీని ఇవ్వడంలో ఈ జోడీ ముందుంటుంది. పాలు తాగడం ఇష్టం లేని వారు ఇలా పెరుగు, డ్రైఫ్రూట్స్ కలిపి తినడం లేదా, వేరుగా వేరుగా అయినా ఒకేసమయంలో తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. 


2. పెరుగు - బెల్లం
ఈ రెండింటినీ విడి విడిగా తింటే ఎంత లాభమో, కలిపి తింటే అంతకన్నా ఎక్కువ లాభం. పెరుగు తినేప్పుడు అందులో చిన్న ముక్క బెల్లం తురుము కలుపుకోండి. చాలా మందికి పెరుగులో పంచదార వేసుకుని తినే అలవాటు ఉంటుంది. పంచదారకు బదులు బెల్లం వేసుకుని తింటే మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్త హీనత సమస్య దరి చేరదు. శరీర ఉష్ణోగ్రతు కూడా క్రమబద్ధీకరిస్తుంది. రక్తన్ని శుద్ధిచేయడంలో బెల్లం ముందుంటుంది. మహిళలకు పెరుగు, బెల్లం కలిపి తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరిగి, రక్త హీనత సమస్య పోతుంది. 


3. పెరుగు - జీలకర్ర
కొందరిలో ఆకలి వేయదు. అజీర్తి సమస్య వేధిస్తుంటుంది. అలాంటివారికి ఈ ఫుడ్ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. పెరుగులో కాస్త నల్ల ఉప్పు, నూనె వేయకుండా వేయించిన జీలకర్రను వేసి నమిలి మింగేయాలి. దీని వల్ల ఆకలి పెరగడంతో పాటూ, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలు కూడా పోతాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. 


Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?


Also read: గర్భం రాకుండా వేయించుకునే లూప్ వల్ల సమస్యలు వస్తాయా?







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి