షెంగ్ షుయ్ ... చైనాలో క్రీపూ 4000 నుండి ప్రజల జీవితాల్లో నాటుకుపోయిన ఓ నమ్మకం. ఇంటిని కొన్ని రకాలు వస్తువులు, మొక్కలతో అలంకరించడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మిదేవి అనుగ్రహాన్ని పెంచుకోవచ్చని షెంగ్ షుయ్ చెబుతోంది. షెంగ్ షుయ్ ను ఒక శక్తి ప్రవాహంగా భావిస్తారు చైనాలో. మనీప్లాంట్, కాయిన్ ప్లాంట్లు, లాఫింగ్ బుధ్దా, వెదురు మొక్కలు, స్ఫటికాలు, అద్దాలతో కూడిన అలంకరణ వస్తువులు, డ్రాగన్ విగ్రహాలు ఇలా చాలా వస్తువులు షెంగ్ షుయ్ నమ్మకంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ నమ్మకాలు బాగానే ప్రబలాయి. చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడానికి ప్రధాన కారణం ... సిరిసంపదలు కలిసివస్తాయనే. అయితే సైన్సు పరంగా చూసుకున్నా మనీ ప్లాంట్ మంచిదే. అది ఎయిర్ ప్యూరిఫైర్ గా పనిచేస్తుంది. అయితే షెంగ్ షుయ్ ప్రకారం మనీ ప్లాంట్, కాయిన్ ప్లాంట్లలో ఏది ఇంట్లో పెంచితే పాజిటివ్ శక్తి పెరిగి, లక్ష్మి దేవి కటాక్షం పొందవచ్చు? ఈ రెండు మొక్కల్లో దేనికి ఈ శక్తి ఎక్కువ? 


కాయిన్ ప్లాంట్లు అంటే?
షెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం కాయిన్ మొక్కలకే కాసుల వర్షం కురిపించే పవర్ ఎక్కువ. జేడ్, క్రాసులా ఓవటా...ఇవన్నీ కాయిన్ ప్లాంట్లకు ఉదాహరణలు. వీటి ఆకులు చిన్నగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి. అందుకే వీటిని కాయిన్ మొక్కలు అని పిలుస్తారు. షెంగ్ షుయ్ ప్రకారం... కాయిన్ ప్లాంట్లను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టు పాజిటివ్ శక్తి పెరిగి ఆర్థిక సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. రుణబాధల్లో ఉన్నవారికి ఈ మొక్కలు త్వరగా ఉపశమనం కలిగిస్తాయని చైనాలో ప్రగాడమైన నమ్మకం. 


ఎక్కడ పెడితే కలిసొస్తుంది?
మనీ ప్లాంట్ తో పోలిస్తే కాయిన్ ప్లాంట్ల వల్ల సిరిసంపదలు నాలుగురెట్లు పెరుగుతాయని నమ్ముతారు. 
1. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కాయిన్ ప్లాంట్లలో ఏదో ఒక రకం మొక్కని పెడితే పేదరికం పూర్తిగా తొలగిపోతుందని షెంగ్ షుయ్ చెబుతోంది. 
2. కాయిన్ ప్లాంట్లను ఇంటిలోపల ఉంచాలనుకుంటే ఈశాన్య (నార్త్ -ఈస్ట్) దిశలో పెట్టండి. ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, ఆర్థిక పురోగతి కలుగుతుంది. 
3. వ్యాపార స్థలంలో లేదా దుకాణంలో అయితే దాన్ని ప్రధాన ద్వారం పైన లేదా ఆగ్నేయ దిశ (సౌత్ -ఈస్ట్)లో ఉంచండి. మంచి లాభాలు వస్తాయి. 
4. అన్నింటికన్నా ముఖ్యంగా పడుకునే గదిలో కాయిన్ ప్లాంట్లు పెట్టవద్దు. ఇవి మానసిక సమస్యలను కలిగిస్తుందని షెంగ్ షుయ్ చెబుతోంది. 


Also read: ఈ చిన్న ట్యాబ్లెట్ చెరువు నీటిని మంచినీరుగా మార్చేస్తుంది .... కొత్త పరిశోధన సక్సెస్


Also read: గర్భం రాకుండా వేయించుకునే లూప్ వల్ల సమస్యలు వస్తాయా?


Also read: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి