దేశంలో కరెంట్ సంక్షోభం ఏర్పడిందని గగ్గోలు రేగుతోంది. అయితే అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. కొన్ని రాష్ట్రాలు మిగులు విద్యుత్‌ను అమ్ముకుని దండిగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గత రెండు రోజులుగా 49 మిలియన్ యూనిట్లను పవర్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా ఇతర రాష్ట్రాలకు అమ్మింది. ప్రస్తుతం పీక్ అవర్స్‌లో ఒక్కో యూనిట్ రూ. 20 వరకూ పలుకుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించినట్లుగా తెలుస్తోంది. 


Also Read : ప్రజలకు కోతలు విధించి ఎక్స్ఛేంజీలలో కరెంట్ అమ్మకం .. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం !
  
ప్రస్తుతం తెలంగాణకు విద్యుత్ సమస్య లేదు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంత  బొగ్గు అందుబాటులో ఉంది. జల విద్యుత్ ప్రాజెక్టులూ యథావిధిగా నడుస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా ఉన్నాయి. దీంతో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. తెలంగాణలో కరెంట్ కోతలు విధించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటంతో గరిష్టంగా ఉత్పత్తి చేస్తూ బహిరంగ విపణిలో అమ్ముతోంది.  ప్రస్తుతం తెలంగాణలో వినియోగం 198.26 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఇందులో జెన్‌కో థర్మల్‌ విద్యుత్కేంద్రాల వాటా 72.35 మిలియన్‌ యూనిట్లు కాగా, జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాల వాటా 45.60 మిలియన్‌ యూనిట్లు, ఇక సింగరేణి థర్మల్‌ కేంద్రం 25.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును అందిస్తోంది.


Also Read : దేశంలో విద్యుత్ సంక్షోభంపై పవర్ మినిస్టర్ ఏమన్నారంటే?


కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థల నుంచి 26.66 మిలియన్‌ యూనిట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 27.288 మిలియన్‌ యూనిట్లు లభిస్తోంది.  దేశంలోని పలుప్రాంతాల్లో కొరత ఉండడంతో తెలంగాణ విద్యుత్తును ఎనర్జీ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియాలో అమ్ముతోంది.  సోమవారం 29 మిలియన్‌ యూనిట్లు, మంగళవారం 20 మిలియన్‌ యూనిట్లను విక్రయించింది. ఆయా సమయాల్లో డిమాండ్‌ను యూనిట్‌ ధర గరిష్ఠంగా రూ.20 వరకు పలుకుతుండడం  వల్ల భారీగా భారీగా ఆదాయం సమకూరినట్లయింది. 


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


కేంద్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు అమ్ముకోవద్దని అవసరం ఉన్నరాష్ట్రాలకు పంపిణీ చేయాలని మంగళవారం ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు ప్రజలకు కోతలు విధించి మరీ అమ్ముతున్నాయని.. ఇలా చేస్తే కేంద్రం వద్ద ఉన్న మిగులు విద్యుత్‌ను కేటాయించబోమని హెచ్చరించింది. అయితే తెలంగాణ మాత్రం కోతలు విధించడం లేదు.. మిగులు విద్యుత్‌ను మాత్రమే అమ్ముతోంది. 


Also Read : విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి