దేశంలో పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. బొగ్గు సరఫరాను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు రోజులకు సరి పడా ఉండేలా ప్రతి రాష్ట్రానికి బొగ్గు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికైనా మిగులు విద్యుత్ ఉంటే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ అత్యధిక రేటుకు పవర్ ఎక్స్ఛేంజ్‌లలో అమ్మడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అలాగే కొన్ని రాష్ట్రాలు ప్రజలకు కోత విధించి మరీ అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read : గుడ్ న్యూస్.. పిల్లలకు టీకా.. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దేశంలో కరెంట్ సంక్షోభంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇప్పటికే నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్డానికి కేంద్రం సిద్ధమయింది. ముందుగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ వాడుకోవాలని ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నాయిని... వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్ముకోకూడదని స్పష్టం చేసింది.ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలా చేస్తే కేటాయించని విద్యుత్ వాడుకునే వెసులుబాటు తొలగిస్తామని హెచ్చరించింది.
Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే నని..మిగులు ఉన్న రాష్ట్రాలు ఆ విషయం కేంద్రానికి తెలియచేయాలని ఆదేశించింది. మిగులు ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పవర్ ఎక్స్ఛేంజీలో విద్యుత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు కరెంట్ కోతలు విధించి మరీ అమ్ముకుంటున్నాయి. ఈ విషయం తెలిసి కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
దేశంలో బొగ్గు కొరత లేదని.. కరెంట్ సంక్షోభం రానే రాదని కేంద్రం చెబుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం బీద అరుపులు అరుస్తూనే ఉన్నాయి. బొగ్గుకు డబ్బులు కట్టకపోవడం వల్ల కొందరికి.. ఆలస్యం అవుతోంది. అయితే బకాయిలు చెల్లించకపోయినా బొగ్గు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. కరెంట్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు కేంద్రం చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read : "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి