ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. పోలీసుకు గాయాలు అయ్యాయి. మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్ అటవీప్రాంతంలో ఈ ఘటన నెలకొంది. మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఒజీ జవాన్ కు తీవ్ర గాయాలు కావడంతో హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొంతకాలం కిందట.. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవితో పాటు ఐదుగురు లొంగిపోయారు. కొంత కాలంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కూడా పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. విశాఖ ఏజెన్సీలో అణువణువు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులకు చెక్ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఏవోబీ బోర్డర్లో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం… ఆపై వారు సరెండర్ అయ్యినట్టు ప్రకటించటం మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి.
ఇటీవలే.. ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ
ఇటీవలే.. దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమావేశం అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై చర్చించారు.
దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రిత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని 45 జిల్లాల్లో నక్సల్స్ ఉనికి ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 90 జిల్లాలను మావో ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించాయి. నక్సల్స్ సమస్యను.. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌డబ్ల్యూఈ) అని పిలుస్తున్నారు. 2019లో 61 జిల్లాలు.. 2020లో కేవలం 45 జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2015 నుంచి 2020 వరకు ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 380 మంది భద్రతా సిబ్బంది.. వెయ్యి మంది పౌరులు.. 900 మంది నక్సల్స్ మరణించినట్లు తెలిపింది. అలాగే మొత్తం 4,200 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు నివేదించింది.
Also Read: Sunday Funday: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. ఇంకోచోట కూడా సన్ డే ఫన్ డే, ఎక్కడంటే..
Watch Video : టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి హరీష్ రావుకి షాక్ ... ఏం జరిగిందో చూడండి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి