తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపిస్తోంది. ఈ వేడకులు సద్దుల బతుకమ్మను నిర్వహించడంతో పూర్తవుతాయి. కానీ ఈ సారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహించుకోవాలన్న సందిగ్ధత నెలకొంది. 8వ రోజున జరుపుకోవాలా... లేదా 9వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలా అన్నది అయోమయంగా మారింది. ఏటా ఎంగిలి పువ్వు బతుకుమ్మతో మొదలై.. 9వ రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈసారి రెండు తిథులు ఒకే రోజు వస్తుండడంతో.. 8వ రోజు అష్టమి వస్తోంది. ఇదే ఇప్పుడు సద్దుల బతుకమ్మ ఒకరోజు ముందే జరుపుకోవాలా.. లేదా అన్న టెన్షన్ భక్తుల్లో కనిపిస్తోంది.
తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. బుధవారం నాడు అంటే 13వ తేదీనే సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని వేదపండితులు సూచిస్తున్నారు. కానీ ఆరో తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు.. 14వ తేదీ గురువారం రోజులో తొమ్మిది రాత్రులు ముగియనున్నాయి. అయితే, 13వ తేదీనే దుర్గాష్టమి కావడతో కొంత మంది ఒక రోజు ముందుగానే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని సూచించడంతోనే అయోమయం నెలకొంది.
అయితే కొంత మంది పండితులు మాత్రం గురువారమే సద్దుల బతుకమ్మ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధర్మశాస్త్రానుసారంగా 14వ తేదీన నిర్వహించుకోవాలని చెబుతున్నారు.
కొంత మంది బుధవారం.. మరికొంత మంది గురువారం అని చెబుతూండటంతో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. తెలంగాణ విద్వత్సభ ఈ అంశంపై వివరణ ఇచ్చింది. దుర్గాష్టమి రోజే సద్దుల బతుకమ్మ అని స్పష్టం చేసింది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆచారాల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించింది.
Also Read : 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
ఈ గందరగోళం నడుమ వేడుకల నిర్వహణ ఎప్పుడనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని మహిళలు కోరుతున్నారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసినా వివాదం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి