హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్. పని ఒత్తిడికి దూరంగా వారాంతంలో ప్రజలకు ఆట విడుపు కోసం ఇప్పటికే సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్‌పై ప్రభుత్వం ఆహ్లాదకర కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను నిలిపివేసి రాత్రి వరకూ రకరకాల వినోద కార్యక్రమాలను, లేసర్ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి హైదరాబాద్ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఆహ్లాదం కోసం నగర వాసులు ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పైకి వచ్చి చల్లటి గాలికి సేదతీరుతున్నారు. ఈ అధిక స్పందన వేళ జీహెచ్ఎంసీ మరో చోట కూడా సన్ డే ఫన్ డే నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే చార్మినార్ వద్ద సన్ డే ఫన్ డే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహిస్తున్న ‘సండే ఫన్ డే’ కార్యక్రమాన్ని త్వరలో చార్మినార్ దగ్గర కూడా చేపడతామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా స్పందన వస్తుండడంతోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. కాబట్టి ‘సం డే ఫన్ డే’ కార్యక్రమాన్ని చార్మినార్ దగ్గర కూడా నిర్వహించాలని మంత్రులు కూడా సూచించారని చెప్పారు.
దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని, ఈ కార్యక్రమం కోసం ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. రాత్రి 11.30 గంటలు దాటాక చార్మినార్ దగ్గర ఉంటే పోలీసులు ఇళ్లకు వెళ్లండంటూ పంపిచేస్తున్నారని, అలా కాకుండా రాత్రి లైఫ్‌ని ఆస్వాదించేందుకు అవకాశం ఇవ్వాలని స్థానికులు చాలా మంది కోరారు.
Also Read: Saddula Batukamma: బుధవారమా..? గురువారమా ? సద్దుల బతుకమ్మ తేదీపై గందరగోళం !
Also Read: Flying Ghost: పొలంలో ఘోస్ట్ రైడర్... బొమ్మను చూసి పక్షులు పరార్... యువరైతు వినూత్న ఆలోచన
Also Read: Medak: మెదక్‌లో నీచం.. భార్యకి, కొడుక్కీ ఒక అబ్బాయే లవర్.. రోజూ అదే పని.. చివరికి ఇంట్లో ఘోరం