ఓ యువరైతు చేసిన వినూత్న ఆలోచన పంటనష్టాన్ని తగ్గించింది. అటవీ జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఆ రైతు ఘోస్ట్ రైడర్ ను బొమ్మను రూపొందించారు. ఈ హర్రర్ బొమ్మ గాలికి ఊగడం చూసిన జంతువులు, పక్షులు ఆ పంటపొలం దారిదాపుల్లోకి రావడంలేదు. గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా ఉంటాయి. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన యువరైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఘోస్ట్ రైడర్ లాంటి ఊగే బొమ్మను తయారు చేశారు. ఈ ఊగే బొమ్మ వల్ల వ్యవసాయ క్షేత్రంలోకి అటవీ జంతువులు, పక్షులు రావడంలేదని యువకుడు తెలిపారు. పంటలు నష్టపోకుండా ఈ బొమ్మ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు.
తగ్గిన పంట నష్టం
ఈ బొమ్మ తయారికీ ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు, ఒక స్ప్రింగ్ తో జోడించి సైకిల్ హాండీల్..డబ్బాకు ఓ పాత అంగిని తొడిగించి దానికి కొన్ని చినిగిపోయిన పెలుకలను జతచేసి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు. గాలీ వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను ఇలా అటు ఇటూ ఊగుతోంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రావడంలేదని చెబుతున్నారు. ఈ యువ రైతు వినూత్న ఆలోచనతో పంట నష్టం తగ్గిందని రైతులు చెబుతున్నారు. యువరైతు సాయికిరణ్ చేసిన ప్రయోగం అద్భుతంగా ఉందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అవుతుందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తాను తయారు చేసి ఇస్తానని యువరైతు సాయికిరణ్ తెలిపారు.
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి