తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పరీక్షలే నిర్వహిస్తున్నట్లు ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే ఉండాలని నిర్ణయించారు. 2021-22 విద్యాసంవత్సరానికి పదో తరగతిలో 6 పరీక్షలు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లు ఉండేవి. ఈ సంవత్సరం 6 పరీక్షలే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.  


Also Read: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం


పరీక్షల షెడ్యూల్


తెలంగాణలో పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఒకటి నుంచి 10వ తరగతులకు ఫిబ్రవరి 28 లోపు సిలబస్ పూర్తి చేసి, మార్చి 1 నుంచి రివిజన్ చేయాలని విద్యా శాఖ తెలిపింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 8 వరకు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు అక్టోబర్ 5న ఫార్మేటివ్ అసెస్ మెంట్ పరీక్షలు ఫిబ్రవరి 28న ఎఫ్ఏ 1, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతికి అక్టోబరు 5 లోపు ఎఫ్ఏ 1, డిసెంబరు 31 వరకు ఎఫ్ఏ 2 పరీక్షలు పూర్తి చేయాలని తెలిపింది. మార్చి, ఏప్రిల్లో పదో తరగతి తుది పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.


Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ


గతేడాదే నిర్ణయం


కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష విధానంలో మార్పులు చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వం ఈ మార్పులు గతేడాదే చేసింది. కానీ చివరి నిమిషంలో పరీక్ష లేకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈ ఏడాది ఆరు పరీక్షల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. కొత్త విధానంతో పదో తరగతి విద్యార్థులకు 6 పరీక్షలే నిర్వహిస్తారు. ఇప్పటి వరకూ 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 166 రోజుల బోధన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంకా గురుకులాలు తెరుచుకోలేదు. విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేశారు. 


Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!


పరీక్ష సమయం పెంపు... సిలబస్ తగ్గింపు


పదో తరగతి పరీక్షల టైం అరగంట పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులకు గం.3.15 నిమిషాల పాటు  ఒక్కో పరీక్ష జరగనుంది. భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయని తెలిపింది. పశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్‌ఏ పరీక్షలకు 20 మార్కులు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు సిలబస్‌ ను ప్రభుత్వం తగ్గించింది. 1 నుంచి 10 తరగతులకు 70 శాతం సిలబస్‌ మాత్రమే బోధించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 


Also Read: హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర.. రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి