సమంత-నాగచైతన్య విడిపోతున్నారని చాలా కాలం పాటు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ రీసెంట్ గా ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించింది. కనీసం అప్పటికైనా రూమర్స్ ఆగుతాయనుకుంటే.. మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సమంతకు తన స్టైలిస్ట్ ప్రీతమ్ తో తప్పుడు సంబంధం ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపై కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సమంత.. ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. ఇలాంటి రూమర్స్ ఏవీ కూడా తనను బ్రేక్ చేయలేవని స్ట్రాంగ్ గా చెప్పింది.
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
తాజాగా ప్రీతమ్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఇలాంటి రూమర్లను నాగచైతన్య ఖండిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు ప్రీతమ్. సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలోకి తనను లాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. సమంత తనకు సోదరి లాంటిదని, ఆమెని జిజి అని పిలుస్తానని చెప్పాడు. జిజి అంటే నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో చెల్లెలు అని అర్ధం. అలాంటి వ్యక్తితో తనకు ఎఫైర్ అంటగట్టడాన్ని తప్పుబట్టారు ప్రీతమ్. సమంతకు 'ఐలవ్యూ' చెప్పానని చాలా మంది తనను ప్రశ్నిస్తున్నారని.. కుటుంబ సభ్యులకు 'ఐలవ్యూ' చెప్పడంతో తప్పేముందని ప్రశ్నించాడు.
ఈ మొత్తం వ్యవహారంపై నాగచైతన్య స్పందించకపోవడాన్ని తప్పుబట్టాడు ప్రీతమ్. సమంతతో తను ఎలా ఉంటానో.. నాగచైతన్యకు కూడా తెలుసని.. అలాంటప్పుడు ఈ తరహా రూమర్స్ ను ఖండించాల్సిన బాధ్యత అతడిపై ఉందంటున్నాడు ప్రీతమ్. సమంత గురించి అలా మాట్లాడడం తప్పని.. చైతు ఇప్పటికే చెప్పి ఉంటాడని అనుకున్నానని.. కనీసం దీనికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేసినా.. పరిస్థితి ఎంతో బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా.. నాగచైతన్య నుంచి ఓ ప్రకటన వస్తే బాగుంటుందని అనుకుంటున్నానని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు.
సమంతతో తను రిలేషన్ లో ఉన్నట్లు భావిస్తున్న కొందరు ఫ్యాన్స్ తనను చంపుతామంటూ బెదిస్తున్నారని.. తనను బండ బూతులు తిడుతున్నారని.. కెరీర్ నాశసం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా.. వెనక్కి తగ్గనని.. ప్రస్తుతం బాధల్లో ఉన్న సమంతకు అండగా నిలబడతానని ప్రకటించాడు.
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి