భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది.  పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్‌ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు. 


ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో టెర్రరిస్ట్ ను అరెస్టు చేశారు పోలీసులు. అతడి వ ద్ద ఏకే -47 రైఫిల్, హ్యాండ్ గ్రెనేడ్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ కు చెందిన మొహద్ అస్రఫ్‌గా గుర్తించారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్, రమేష్ పార్క్ దగ్గర పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. భారత్ లో నకిలీ గుర్తింపుతో జీవిస్తున్నాడు. ఒక అదనపు 60 రౌండ్ల మ్యాగజైన్, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 2 అధునాతనమైన AK-47 రైఫిల్, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు.. ఏఎన్ఐ తెలిపింది.


చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ ఆయుధాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు.  లక్ష్మీ నగర్‌లోని రమేష్ పార్కు దగ్గరలో అతడు నివసిస్తున్న ప్రదేశంలోనూ అధికారులు సెర్చ్ చేశారు.


Relevant provisions of Unlawful Activities (Prevention) Act, Explosive Act, Arms Act & other provisions being invoked against the man, identified as Mohd Asraf, a resident of Pakistan's Punjab. A search has been conducted at his present address at Ramesh Park, Laxmi Nagar, Delhi.


— ANI (@ANI) October 12, 2021    


ఐఎస్‌ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫేక్‌ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా 18 చోట్ల తనిఖీలు జరుపుతున్నారు.


ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన  కాల్పుల్లో లష్కర్ ఈ తోయిబా-ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.


సోమవారం నాడు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా సూరన్‌కోట్‌లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొసాగిస్తుండగా.. టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు బుల్లెట్ గాయాలవ్వగా వారు ప్రాణాలు కోల్పోయారు.


"మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి