మీరు వాట్సాప్ చాలా వాట్సాప్ గ్రూపులో ఉండే ఉంటారు. చాలా ఫార్వర్ట్ మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య అమూల్ 75వ వార్షికోత్సవం.. గురించి మీకు సందేశం వచ్చే.. అవకాశం ఉంది. ఈ వాట్సాప్ మెసేజ్ లో మీరు సర్వేలో పాల్గొంటే.. రూ.6000 గెలుచుకోవచ్చు అంటూ.. ఓ లింక్ వస్తుంది. మీకు రివార్డు వస్తుందని చెబుతారు. కానీ ఓపెన్ చేయకండి.


అమూల్ 75వ వార్షికోత్సవం పేరుతో వచ్చే సర్వేలో పాల్గొనకపోవడమే మంచిది. అది నకిలీ. రూ.6000 కాదు కదా.. ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకో విషయం ఏంటంటే.. అది అమూల్ సంస్థ చేస్తున్న సర్వే కాదు.  అయితే ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు ట్విట్టర్లోకి వెళ్లారు. తమకు వచ్చిన వాట్సప్ సందేశంపై ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ స్కామ్ గురించి ఇతరులను హెచ్చరించారు. రూ .6,000 ఆఫర్ చేస్తామని చెప్పిన స్కామ్ లింక్ పై క్లిక్ చేయోద్దని తెలిపారు.


అయితే.. ఈలింక్‌పై ట్యాప్ చేయమని "www.amuldairy.com" పంపుతారు. కానీ ఈ లింక్‌ని తెరిచినప్పుడు యూజర్ అనుమానాస్పద లింక్‌కి "నాలెడ్జ్‌.సిజ్" వెళ్తుంది. ఇది అమూల్ కార్పొరేషన్‌కి సంబంధించినది కాదు. మనకు ముందు వచ్చినది అమూల్ పేరుతో వచ్చినా.. ఓపెన్ చేయగా.. బాడీ టెక్స్ట్‌లో ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది. సందేశంలో లింక్ ఇలా ఉంది: "http://palacefault.top/amul/tb.php?_t=16339198711633920036488".  కాబట్టి ఆ లింక్ ని క్లిక్ చేయకపోవడమే మంచిది. మన వ్యక్తిగత సమాచారం చోరీ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ వ్యక్తిగత, బ్యాంక్ డేటాను దొంగిలించగల మాల్వేర్‌లను కలిగి ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని వినియోగదారులకు సూచిస్తున్నారు. 


ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే ఓ విండో ఓపెన్‌ అవుతోంది. అందులో హోమ్‌పేజీలో అమూల్‌ లోగోతో ఓ ఇమేజ్‌ ప్రత్యక్షమవుతోంది. అందులో అమూల్‌ 75వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే.. 6వేల రూపాయలు గెలుచుకుంటారని పేర్కొంటోంది. దీనిని గమనించిన వాళ్లు.. ఆశతో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అవన్నీ చాలా సులువైన ప్రశ్నలే కావడంతో అందరూ చివరి దాకా చేరుకుంటున్నారు. ఆ తర్వాత.. ఈ లింక్‌ను పది వాట్సప్‌ కాంటాక్ట్స్‌కు, నాలుగు వాట్సప్‌ గ్రూపులకు పంపించాలని సూచిస్తోంది. ఆ తర్వాత తిరిగి హోమ్‌పేజీ ఓపెన్‌ అవుతోంది. అంటే.. అందరికీ ఆ లింక్‌ను షేర్‌ చేసిన తర్వాత గానీ, అది తప్పుడు లింక్‌ అని తెలుసుకోలేకపోతున్నారు. అప్పటికి గానీ రియలైజ్‌ అవుతున్న వారు.. కొందరు తిరిగి వాట్సప్‌గ్రూపుల్లో ఇది తప్పుడు లింక్‌ అని, ఎవరూ ఓపెన్‌ చేయొద్దని పోస్ట్‌ చేస్తున్నారు కూడా.


Also Read: 'రాత్రికి రాత్రి ఏంజరుగుంటుందబ్బా..' రిజల్ట్ పై అనసూయ పోస్ట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి