యువతను ప్రోత్సహించడంలో బీసీసీఐ ముందుంటుంది. ఐపీఎల్‌లో మెరిసిన ఆటగాళ్లను మరింత సానపడుతుంది. వారికి అంతర్జాతీయ అనుభవం ఎలా ఉంటుందో నేర్పిస్తోంది. తాజాగా ఇద్దరు యువ క్రికెటర్లను నెట్ బౌలర్లుగా ఎంపికచేసింది. ఐపీఎల్ ఆడుతున్న ఆ ఇద్దరినీ యూఏఈలోనే ఉండాల్సిందిగా సూచించింది.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అవేశ్ ఖాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ను బీసీసీఐ నెట్‌బౌలర్లుగా ఎంపిక చేసింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారిద్దరినే దుబాయ్‌లోనే ఉండాలని సూచించింది. నెట్ బౌలర్లుగా టీమ్‌ఇండియాకు సేవలు అందించాలని స్పష్టం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
'ఉదయాన్నే వచ్చిన ఈ సమాచారం మీ ముఖాల్లో చిరునవ్వులు తీసుకొస్తుంది. వెంకటేశ్ అయ్యర్‌ను యూఏఈలోనే ఉండాలని బీసీసీఐ అడిగింది. అతడి స్నేహితుడు, దిల్లీ పేసర్ అవేశ్ ఖాన్‌నూ ఉండాలని సూచించింది. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు నెట్‌బౌలర్లుగా ఉంటారు. ఇండోర్ నుంచి వచ్చిన ఇద్దరు కుర్రాళ్లకు అభినందనలు!' అని కోల్‌కతా ట్వీట్ చేసింది.
Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!
దిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు అవేశ్ ఖాన్ ఐపీఎల్‌లో ఈ సారి అనూహ్య ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. కేవలం 15 మ్యాచుల్లోనే 23 వికెట్లు తీశాడు. దిల్లీ ప్రధాన ఆయుధంగా మారిపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సత్తా చాటాడు. కెప్టెన్ బాధ్యతలు అప్పగించిన ప్రతిసారీ వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో అప్పుడప్పుడు పరుగులు ఇస్తున్నాడు. దానిని సరిదిద్దుకుంటే అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌గా ఎదుగుతాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఈ ఏడాది రెండో అంచెలో అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఈ కుర్రాడు ఇన్నాళ్లూ ఎందుకు కనిపించలేదబ్బా! అనిపించేలా చేశాడు. పవర్‌ప్లేలో భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ మంచి ఆరంభాలు ఇచ్చాడు. అయితే ఆశ్చర్యంగా అతడి బౌలింగ్ సైతం బాగుడటం కలిసొచ్చింది. మంచి శిక్షణనిచ్చి సాధన చేయిస్తే అంతర్జాతీయ ఆల్‌రౌండర్‌గా ఎదగగలడు. పైగా అతడు ఎడమచేతి వాటం ఆటగాడు కావడం విశేషం. ఈ సీజన్లో 8 మ్యాచుల్లో 265 పరుగులు చేసిన వెంకటేశ్ 45 బంతులేసి 3 వికెట్లు తీశాడు. అందుకే బీసీసీఐ అతడిని నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది. గతంలో నటరాజన్ ఇలాగే ఎంపికై అద్భుతాలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.