రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కథ ముగిసిపోయింది. 9 ఏళ్లపాటు ఆర్సీబీ జట్టుకు సారథ్యం వహించాడు కోహ్లీ. ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి చెందింది. ఆర్సీబీ జట్టుపై 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో గెలుపొందిన కేకేఆర్.. క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది.
కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నాను..
ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఎందుకంటే ఈ సీజనే కెప్టెన్‌గా తన చివరి ప్రయాణమని కొన్ని రోజుల కిందట కోహ్లీ ప్రకటించాడు. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ సహచర ఆటగాడు డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీకి ఆడటంపై తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నాడు. విరాట్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడటంపై పలు అంవాలు షేర్ చేసుకున్నాడు మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ డివిలియర్స్.
Also read: షాకింగ్ న్యూస్! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్ రాహుల్.. ఆర్‌సీబీ కన్ను పడిందా?
‘గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ సారథ్యంలో మ్యాచ్‌లాడాను. కెప్టెన్ గా కోహ్లీ గ్రేట్. సారథిగా ఆర్సీబీని ముందుండి నడిపించాడు. జట్టును అతడు నడిపించిన తీరు అమోఘం. ఆటగాడిగా, వ్యక్తిగా మరింత ముందుకు సాగేలా నాలో ప్రేరణ తీసుకొచ్చాడు. అతడి సారథ్యం నా జీవితంపై ప్రభావం చూపింది. ఎంత మంది జీవితాలలో మార్పు తీసుకొచ్చాడో కోహ్లీకి కూడా అంచనా వేయలేడు. అతడి ఆటతో పాటు కెప్టెన్సీ వ్యక్తిగతంగా నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేసింది.
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
ఒక్క ట్రోఫీ కూడా సాధించకుండానే..
ఆర్సీబీకి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించకుండానే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడు. తొమ్మిదేళ్లపాటు పోరాడిన కోహ్లీ తన జట్టును రెండు పర్యాయాలు ఐపీఎల్ ఫైనల్స్ కే చేర్చాడు. కానీ కప్పు అందించలేకపోయాయన్న బాధ కోహ్లీని వెంటాడుతోంది. మరోవైపు ఒత్తిడి, విమర్శలు తట్టుకోలేక సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ.. 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2016లో ఆర్సీబీ ఫైనల్ చేరిన సీజన్లో ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. కానీ తుది పోరులో ఓటమితో ఆర్సీబీ రన్నరప్‌గా మిగిలిపోయింది. టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియాకు ఈ ఫార్మాట్లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించాడు.
Also Read: జయమ్ము నిశ్చయంబురా! అని ఆడితే కేకేఆర్‌పై దిల్లీ గెలవొచ్చు.. లేదంటే!