టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మరోసారి సహృదయత చాటుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఉచితంగానే సేవలు అందించనున్నాడు. మెంటార్‌గా ఉంటున్నందుకు ఎలాంటి గౌరవ పారితోషికం తీసుకోవడం లేదు. బీసీసీఐ కార్యదర్శి జేషా ఈ విషయం వెల్లడించారు.


Also read: షాకింగ్‌ న్యూస్‌! పంజాబ్‌ను వదిలేయనున్న కేఎల్‌ రాహుల్‌.. ఆర్‌సీబీ కన్ను పడిందా?


మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఐపీఎల్‌ వేదికైన యూఏఈలోనే మెగా టోర్నీ జరుగుతోంది. ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన వెంటనే బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని భారత జట్టుకు మెంటార్‌గా ఎంపిక చేశామని వెల్లడించింది. దాంతో అభిమానులు సహా మాజీ క్రికెటర్లంతా ఆనందం వ్యక్తం చేశారు.


Also read: జయమ్ము నిశ్చయంబురా! అని ఆడితే కేకేఆర్‌పై దిల్లీ గెలవొచ్చు.. లేదంటే!


విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. కాగా మహీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలు అందించాడు. అతడిని పెద్ద మ్యాచులు గెలవడంలో అపారమైన అనుభవం ఉంది. అతడి మేధాశక్తిని ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావించింది. వెంటనే సంప్రదించి మెంటార్‌గా ఒప్పించింది.


Also read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!


కోచ్‌ రవిశాస్త్రితో పాటు జట్టు ఎంపికలో ధోనీ కీలకం కానున్నాడు. అంతేకాకుండా ఎలాంటి మైండ్‌సెట్‌తో దిగాలో అతడు సూచించనున్నాడు. ఇప్పుడు యూఏఈలోనే ఐపీఎల్‌ ఆడుతుండటంతో పిచ్‌లపై అవగాహన పెంచుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎవరితో బౌలింగ్‌ చేయించాలో? ఎంత లక్ష్యం నిర్దేశించాలో? వంటి విషయాలను పంచుకోనున్నాడు. తాజాగా అతడు డబ్బులేమీ తీసుకోవడం లేదని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'ధోనీ ది గ్రేట్‌' అని పొగిడేస్తున్నారు. ఐపీఎల్లో ధోనీసేన ఫైనల్కు చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌ విజేతతో ఫైనల్లో తలపడనుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి