ప్రముఖ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) సంస్థలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులరు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇంజనీరింగ్, జియో సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గేట్ 2021 పరీక్షలో మంచి స్కోర్ సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు నవంబర్ 1వ తేదీతో ముగియనుంది. పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హత వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

ఆసక్తి గల వారు ఓఎన్‌జీసీ అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మెకానికల్/ పెట్రోలియం/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఓఎన్‌జీసీ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: టెన్త్ విద్యార్హతతో రైల్వేలో 2226 జాబ్స్ .. నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే.. 

విభాగాల వారీగా ఖాళీలు

పోస్టు   గేట్ సబ్జెక్టు  పోస్టుల సంఖ్య
ఏఈఈ (ఎలక్ట్రికల్) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 40
ఏఈఈ (మెకానికల్) మెకానికల్ ఇంజనీరింగ్ 33
ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్) ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 32 
ఏఈఈ (డ్రిల్లింగ్) మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ 28
జియోఫిజిస్ట్ (సర్‌ఫేస్) జియోలజీ అండ్ జియోగ్రాఫిక్స్ / ఫిజిక్స్ 24
జియాలజిస్ట్ జియోలసీ అండ్ జియోగ్రాఫిక్స్ 19
ఏఈఈ (సివిల్) సివిల్ ఇంజనీరింగ్ 18
ఏఈఈ (ప్రొడక్షన్) కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్  16
ఏఈఈ (ప్రొడక్షన్) మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్  15
కెమిస్ట్ కెమిస్ట్రీ 14
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ ఎంఈ/ ఈఈ/ ఐఎన్ / పీఈ/ సీహెచ్ / సీఈ/ ఈసీ/ ఈఎస్ 13
ఏఈఈ (ప్రొడక్షన్) పెట్రోలియం పెట్రోలియం ఇంజనీరింగ్ 12
జియోఫిజిస్ట్ (వెల్స్) జియోలజీ అండ్ జియోగ్రాఫిక్స్ / ఫిజిక్స్ 11
ఏఈఈ (Reservior) జియోలజీ అండ్ జియోగ్రాఫిక్స్ / కెమిస్ట్రీ / మాథమెటిక్స్ / ఫిజిక్స్ /పెట్రోలియం ఇంజనీరింగ్ /కెమికల్ ఇంజనీరింగ్ 9
ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ మెకానికల్ ఇంజనీరింగ్  8
ఏఈఈ (సిమెంటింగ్) మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్  6
ఏఈఈ (ఎలక్ట్రానిక్స్) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఫిజిక్స్ 5
ఏఈఈ (ఎన్విరాన్‌మెంట్) ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  5
ఏఈఈ (సిమెంటింగ్) పెట్రోలియం పెట్రోలియం ఇంజనీరింగ్  1

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

Also Read: ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. రూ.1.05 లక్షల వరకు జీతం.. ఇలా అప్లయ్ చేసుకోండి.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి