ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 535 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి రూ.50,000 నుంచి రూ.1,05,000 వరకు నెలవారీ వేతనం అందించనుంది. డిప్లొమా, డిగ్రీ విద్యార్హత గలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి.. నోటిఫికేషన్లో పేర్కొన్న డాక్యుమెంట్లతో (ఆఫ్‌లైన్ విధానం) కలిపి పోస్టు చేయాలి. వేర్వేరు రిఫైనరీలకు విభిన్న చిరునామాలు అందించింది. ఆఫ్‌లైన్ విధానం దరఖాస్తులను అక్టోబర్ 23లోగా పంపాలి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష అక్టోబర్ 24న నిర్వహిస్తారు. ఫలితాలను నవంబర్ 11వ తేదీన విడుదల చేస్తారు. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..
విభాగాల వారీగా ఖాళీలు..
విభాగం | ఖాళీల సంఖ్య |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్- IV (Production) | 296 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఎలక్ట్రికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV | 65 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV | 64 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (P & U) | 35 |
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ IV | 29 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (మెకానికల్) లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV | 27 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV (ఫైర్ అండ్ సేఫ్టీ) | 14 |
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV లేదా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ IV | 4 |
జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ IV | 1 |
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..
ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. ఐఓసీఎల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/latest-job-opening ను ఓపెన్ చేయండి.
2. నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్‌లో (Non-Executive Personnel) Click here to Apply Online పైన క్లిక్ చేయండి.
3. మీరు అప్లయ్ చేయాలనుకున్న పోస్టును ఎంచుకున్నాక.. Proceed పైన క్లిక్ చేయాలి.
4. మీరు ఏ రిఫైనరీలో (Refinery) ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో దానిని ఎంచుకుని.. Proceed పై క్లిక్ చేయాలి.
5. అభ్యర్థులు తమ పేరు, డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హత తదితర వివరాలను ఇవ్వాలి.
6. దరఖాస్తు రుసుం చెల్లించి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
7. దరఖాస్తు ఫామ్‌ను ప్రింటవుట్ తీసుకోవాలి.
8. అప్లికేషన్ ఫామ్‌పైన సంతకం చేసి, ఫోటో అతికించి, జిరాక్స్ కాపీస్ జత చేసి పోస్టులో పంపాలి.
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..