కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ పరిస్థితులు.. ప్రపంచంపై ఎంత ప్రభావం చూపించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ముఖ్యంగా భారతీయ యువతకు శృంగారం(సెక్స్), డేటింగ్‌పై ఉన్న ఆలోచనా విధానం మారిందని డేటింగ్ యాప్ బంబుల్ చేసిన సర్వేలో తేలింది.


మనోళ్లే ముందు..


యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే బంబుల్ యాప్ వినియోగదారులు (34%) ఎక్కువ మంది ఉన్నారు. సెక్స్ విషయానికి వస్తే భారత్‌కు చెందిన వాళ్లే ఎక్కువగా స్పందిస్తారని ఈ నివేదికలో తేలింది.


ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, కెనడా, భారత్ దేశాలలో బంబుల్ యాప్ వినియోగించే 2003 మంది సింగిల్ అడల్ట్స్‌పై ఈ ఏడాది జులైలో ఈ సర్వే చేశారు. YouGov ఈ సర్వే నిర్వహించింది.


అభిప్రాయం మారింది..


ఇందులో దాదాపు 65 శాతం మంది సింగిల్ ఇండియన్స్.. కరోనా తర్వాత సెక్స్‌పై తమ అభిప్రాయం మారిందని తెలిపారు. ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (37%) తాము డేటింగ్ చేసే వ్యక్తులతో తమ కోరికలను స్వేచ్ఛగా చెప్పినట్లు వెల్లడించారు. ముగ్గురిలో ఒకరు మాత్రం (33%) కరోనా సెకండ్ వేవ్ వచ్చిన మార్చి సమయంలో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వారితో కలిసి సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు.


బంబుల్ యాప్‌పై సర్వే చేసిన దాంట్లో దాదాపు సగం మంది భారతీయులు (47%) తమ భాగస్వామి నుంచి తాము ఏం కోరుకుంటున్నామనే దానిపై ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. సగం కంటే ఎక్కువ మంది భారతీయులు (60%).. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత సెక్స్ విషయంలో మరింత యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. 


మరింత ఆత్మవిశ్వాసంతో..


భారతీయులు ప్రస్తుతం డేటింగ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో పాల్గొంటున్నారని, తమ భాగస్వామి నుంచి ఏం కావాలో తెలుసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. సెక్స్‌ అవగాహన, అభిరుచులపై తమ ఆలోచనలను, కోరికలను భాగస్వాములతో స్వేచ్ఛగా పంచుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. 


భారత్‌లో గతంతో పోలిస్తే ప్రస్తుతం సెక్స్, అన్యోన్యత విషయంలో దాదాపు (51%) మంది వైవిధ్యంగా ఆలోచిస్తున్నట్లు తేలింది. భారత్‌లో సింగిల్‌గా ఉన్న యువత ఎక్కువగా డేటింగ్ విషయానికి వచ్చే సరికి తమకు సరైన భాగస్వామిని ఎన్నుకునే విషయంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పితా సమద్దార్ తెలిపారు.


Also Read: దిగొచ్చిన పుత్తడి, స్వల్పంగా పెరిగిన వెండి..ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...


Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి