బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్‌ సీఆర్‌పీ క్లర్క్- XI (IBPS CRP-XI) దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 7) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలైలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లు వెలువెత్తిన నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఐబీపీఎస్‌‌ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది.

తాజాగా ఈ భర్తీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐబీపీఎస్ ప్రకటించింది. అంతకుముందు క్లర్క్ నోటిఫికేషన్ విడుదలైన సమయంలో అంటే జూలై 12 నుంచి 14వ తేదీల మధ్య రిజిస్టర్ చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలు ఉన్నాయి.

 Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..

13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష.. 
ఐబీసీఎస్ నోటిఫికేషన్ ద్వారా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈసారి ఇంగ్లిష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు (ప్రిలిమ్స్, మెయిన్స్) నిర్వహించనున్నట్లు పేర్కొంది. వీటిలో తెలుగు కూడా ఉండనుంది. డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఐబీపీఎస్ వెబ్‌సైట్ https://www.ibps.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

 Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..

ఏయే బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయంటే?
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింద్‌, ఇండియన్‌ బ్యాంకుల్లోని  క్లర్క్ పోస్టులనుకి ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. 

ముఖ్యమైన తేదీలివే.. 

ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2021  జూలై 11, 2021
ఐబీపీఎస్ క్లర్క్ అప్లికేషన్ ఫామ్ 2021 ప్రారంభం (రీఓపెనింగ్ విండ్) 2021 అక్టోబర్ 7
దరఖాస్తు చివరి తేదీ 2021 అక్టోబర్ 27 
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ విడుదల 2021 నవంబర్
ప్రీ ట్రైనింగ్ 2021 నవంబర్ 
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్ పరీక్షకు అడ్మిట్ కార్డుల విడుదల 2021 నవంబర్ / డిసెంబర్ 
ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 డిసెంబర్
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2021 డిసెంబర్ / 2022 జనవరి
మెయిన్స్ కాల్ లెటర్ల డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభం 2021 డిసెంబర్ / 2022 జనవరి
ఐబీపీఎస్ మెయిన్ ఎగ్జామ్ జనవరి / ఫిబ్రవరి 2022 
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ 2022 ఏప్రిల్ 

 Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

 Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి