బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్. బ్యాంకు పరీక్షలను ఇంగ్లీష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు పలు కీలక సూచనలు చేసింది. ఈరోజు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ కేడర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు ( ప్రిలిమ్స్, మెయిన్స్) ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిధిలోని క్లరికల్ ఉద్యోగాల పరీక్షలను సైతం ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీని కోసం కేంద్ర ఆర్థిక శాఖ వేసిన కమిటీ సూచనల ఆధారంగా పరీక్షలను నిర్వహిస్తారు. 


Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..


కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు..
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే దీనిపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషలో బ్యాంకు పరీక్షలు నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో స్పందించిన కేంద్రం.. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ను (ఐబీపీఎస్‌)‌ ఆదేశించింది. ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక వచ్చే వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలిపింది. దీంతో క్లరికల్ రిక్రూట్‌మెంట్‌ -XI ప్రక్రియ నిలిచిపోయింది.


Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..


తెలుగులోనూ పరీక్షలు..
ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేసే వాటిలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) ఉద్యోగాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని.. దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి మద్దతిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ 2019లో పార్లమెంట్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇదే కనుక అమలైతే తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనే అభ్యర్థులు పరీక్షలు రాయవచ్చు. భాష కారణంగా చాలా మంది విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు భాష విషయంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వీరందరికీ ఉపయోగకరం కానుంది. 






Also Read: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..


Also Read: ఏపీలో 151 ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. రూ.91 వేల వరకు వేతనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి