ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్లు తెలిపింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు గడువు అక్టోబర్‌ 25తో ముగియనుంది. రాత‌ప‌రీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ ను సంప్రదించవచ్చు. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.37,100 నుంచి రూ. 91,450 వరకు ఉంటుంది. 

Also Read: CM Jagan Mohan Reddy: భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్... వైద్య, ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం

విభాగాల వారీగా ఖాళీలు.. 

విభాగం  ఖాళీల సంఖ్య
మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆయుర్వేదం)  72
మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (యునానీ) 26
మెడిక‌ల్ ఆఫీస‌ర్ (హోమియో) 53

విద్యార్హత, వయోపరిమితి.. 
ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే ఏడాది పాటు ఇంట‌ర్న్‌షిప్ చేసి ఉండాలి. దీంతోపాటు ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న సంబంధిత విభాగంలో మెడిక‌ల్ ప్రాక్టీషన‌ర్‌గా రిజిస్ట‌ర్ అయి ఉండాలి. 2021 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.  

Also Read: SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..

పరీక్ష విధానం.. 
ప‌రీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్ర‌తీ త‌ప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. 

పేప‌ర్ -1 జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ మెంట‌ల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
పేప‌ర్-2 ఆయుర్వేదం లేదా యునానీ లేదా హోమియో 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు

ఇలా దరఖాస్తు చేసుకోండి.. 

  • ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను ఓపెన్‌ చేయండి.
  • ఇంతకుముందు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ అయి ఉంటే.. ఆ వివరాలతో లాగిన్ అయ్యి సంబంధిత పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వకపోతే.. Login ఆప్ష‌న్లోకి వెళ్లి New User అని క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలను అందించి రిజిస్టర్ చేసుకోవాలి. 
  • దీంతో యూజ‌ర్ ఐడీ, పాస్ వ‌ర్డ్ క్రియేట్ అవుతాయి. 
  • వీటి ద్వారా లాగిన్ అయ్యి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

Also Read: RRC Railway Recruitment 2021: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Also Read: UPSC ESE Notification 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి