ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇది 43వ మ్యాచ్. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైని భారీ తేడాతో ఓడించి బెంగళూరు మంచి ఊపు మీదుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఢిల్లీ, సన్‌రైజర్స్‌పై ఓటములతో రాజస్తాన్ ఒత్తిడిలో ఉంది.


జోష్‌లో బెంగళూరు
గత మ్యాచ్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి ముంబైని ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ గత మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. యజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా బంతితో రాణించారు.


Also Read: Sanju Samson IPL Record: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు


రాజస్తాన్ పడుతూ లేస్తూ..
రాజస్తాన్ గత మ్యాచ్‌లో మూడు మార్పులు చేసింది. గాయపడ్డ కార్తీక్ త్యాగి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. ఈ మధ్య రాజస్తాన్‌కు కార్తీక్ చాలా కీలకంగా మారాడు. తను జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుంది. ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్‌ల్లో ఎవరిని ఈసారి జట్టులోకి తీసుకుంటారో చూడాలి. 


రెండు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత ఐదు మ్యాచ్‌ల్లో అయితే మూడు సార్లు బెంగళూరు విజయం సాధించింది.


తుదిజట్లు(అంచనా)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్, చమీరా


రాజస్తాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్ స్టోన్, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, మోరిస్, చేతన్ సకారియా, ఉనద్కత్/త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్


Also Read: David Warner on IPL: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?


Also Read: IPL Spot Fixing: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్‌ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి