రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 


Also Read:  సీఎం జగన్ పై హీరో విశాల్ ప్రశంసలు... హ్యాట్సాప్ అంటూ ట్వీట్... ఏపీ నిర్ణయాన్ని తమిళనాడులో కూడా అమలుచేయాలని రిక్వెస్ట్


వైద్యం కోసం చేసే ఖర్చులు తగ్గాలి


కోవిడ్‌–19 నివారణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో కావాల్సిన సిబ్బందిపై సీఎం జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ఉన్న అవసరాలు తదితర వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, కానీ సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి నెలకొందన్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు తగిన సిబ్బందితో సమర్థవంతంగా నడపాలని సీఎం జగన్ అన్నారు.  ఒక డాక్టరు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలన్నారు. తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. 


Also Read: సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ... బహ్రెయిన్ లో తెలుగు వారి సమస్య పరిష్కారం...


వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌


రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియను అక్టోబర్‌ 1న మొదలు పెట్టి నవంబర్‌ 15 నాటికి కార్యాచరణ పూర్తిచేసేలా ఉండాలన్నారు. 


Also Read: మద్యం నియంత్రణకే రేట్లు పెంపు... ఎస్ఈబీపై సీఎం జగన్ రివ్యూ... ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి