ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయంపై హీరో విశాల్ ప్రసంశలు కురింపించాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే ఒక వెబ్ పోర్టర్ అందుబాటులోకి తీసుకొచ్చి సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ జీవోను విడుదల చేసింది. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ విధంగా సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించనుందని ఆ జీవోలో పేర్కొంది.
తమిళనాడులో అమలు చేస్తే
సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్రం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పోర్టల్ నడుస్తుందని పేర్కొంది. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా హీరో విశాల్ స్పందించారు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ విధానాన్ని తమిళనాడులో కూడా అమలుచేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు.
Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవసీ పటిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఇవే!