దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో. కంపెనీ తన 'ఇన్' సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని ఎప్పటినుంచో చూస్తుంది. అదే ఈ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ గీక్‌బెంచ్ సైట్‌లో కూడా కనిపించింది. పేరును బట్టి చూస్తే, గత ఏడాది నవంబర్‌లో భారతదేశంలో లాంచ్ అయిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్‌కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. ఈ నెలాఖరులోపు ఫోన్ లాంచ్ చేయవచ్చని తెలిపారు.
అయితే ఈ ఫోన్ విడుదలకు సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో ఇటీవల గీక్‌బెంచ్‌లో కనిపించింది. E7748 అనే మోడల్ నంబర్ తో ఈ బెంచ్‌మార్కింగ్ సైట్‌లో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 లిస్ట్ అయింది.
ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు కూడా ఈ లిస్టింగ్ ద్వారా లీక్ అయ్యాయి. మీడియాటెక్ ఎంటీ6785 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. మోడల్ నంబర్ ను బట్టి ఇది మీడియాటెక్ హీలియో జీ90 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రోలో 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం ఉండనున్నాయి. గీక్‌బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో సింగిల్-కోర్ స్కోర్ 519 పాయింట్లను, మల్టీ-కోర్ టెస్టులో 1,673 పాయింట్లను మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో సాధించింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1ను కొద్దిగా అప్ గ్రేడ్ చేసి మిడ్ రేంజ్ విభాగంలో ఈ మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రోను లాంచ్ చేస్తున్నట్లు ఈ స్పెసిఫికేషన్లను చూసి చెప్పవచ్చు. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ధర మనదేశంలో రూ.11,490గా ఉంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో ధర కూడా రూ.15 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేయడం విశేషం.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు!
Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కారణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవకాశం!
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
Also Read: గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ రియల్ మీ ఫోన్ పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.6 వేల వరకు!