రియ‌ల్ మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ మ‌న‌దేశంలో ఇటీవ‌లే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ పై కంపెనీ ఏకంగా రూ.6,000 ఆఫ‌ర్ ను అందించింది. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం సెప్టెంబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు మాత్రమే అందుబాటులో ఉండ‌నుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెస‌ర్ ను రియ‌ల్ మీ అందించింది.


రియ‌ల్ మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ ధ‌ర‌
రియ‌ల్ మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణ‌యించారు. అయితే వీటిని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 త‌గ్గింపు ల‌భించ‌నుంది. అంటే రూ.20,999 నుంచే దీని ధ‌ర ప్రారంభం కానుంద‌న్న మాట‌. ఆస్టరాయిడ్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, మిల్కీ వే రంగుల్లో ఇది అందుబాటులో ఉంది..


రియల్ మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ ఫీచ‌ర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై రియ‌ల్ మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌‌గా ఉంది. 


దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. 50W ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామ‌ర్థ్యం 64 మెగాపిక్సెల్ గా ఉంది. ఇది సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్‌. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా వెన‌క‌వైపు ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, 5జీ, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ కూడా ఇందులో రియ‌ల్ మీ అందించింది. డాల్బీ ఆడియో, హైరిజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉన్నాయి.


Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. ధ‌ర రూ.14 వేల‌లోపే.. రియ‌ల్ మీ సూప‌ర్ ట్యాబ్లెట్!


Also Read: OnePlus: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..


Also Read: Jio phone next: ప్రపంచంలోనే అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్.. కొనాలంటే అప్ప‌టిదాకా ఆగాల్సిందే!