రియ‌ల్ మీ మ‌న‌దేశంలో త‌న మొట్ట‌మొద‌టి ట్యాబ్లెట్ ను లాంచ్ చేసింది. అదే రియ‌ల్ మీ ప్యాడ్. ఇందులో రియ‌ల్ మీ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెస‌ర్ ను అందించారు. డాల్బీ అట్మాస్ ను కూడా ఈ ట్యాబ్లెట్ స‌పోర్ట్ చేయ‌నుంది. 10.4 అంగుళాల డిస్ ప్లే ఇందులో ఉండ‌టం విశేషం.


రియ‌ల్ మీ ప్యాడ్ ధ‌ర‌
దీని ధ‌ర మ‌న‌దేశంలో రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న‌ వైఫై ఓన్లీ వేరియంట్ ధ‌ర‌. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న‌ వైఫై + 4జీ వేరియంట్ ధ‌ర‌ను రూ.15,999గానూ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న‌ వైఫై + 4జీ వేరియంట్ ధ‌ర‌ను రూ.17,999గానూ నిర్ణ‌యించారు.


సెప్టెంబ‌ర్ 16వ తేదీన ఫ్లిప్ కార్ట్, రియ‌ల్ మీ.కాం, ప్ర‌ముఖ ఆఫ్ లైన్ రిటైల‌ర్ల‌లో వైఫై + 4జీ వేరియంట్ల‌ సేల్ జ‌ర‌గ‌నుంది. వైఫై ఓన్లీ వేరియంట్ సేల్ వివ‌రాలు తెలియ‌రాలేదు.


దీనిపై ఆఫ‌ర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డు లేదా ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌కు రూ.1,000 త‌గ్గింపు అందించ‌నున్నారు.


రియ‌ల్ మీ ప్యాడ్ స్పెసిఫికేష‌న్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియ‌ల్ మీ యూఐ ఫ‌ర్ ప్యాడ్ స్కిన్ పై ఈ ట్యాబ్లెట్ ప‌నిచేయ‌నుంది. ఇందులో 10.4 అంగుళాల డ‌బ్ల్యూయూఎక్స్ జీఏ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 82.5 శాతంగా ఉంది. నైట్ మోడ్ లో దీని బ్రైట్ నెస్ 2 నిట్స్ వ‌ర‌కు తగ్గిపోనుంది. దీని వ‌ల్ల చీక‌టిలో ట్యాబ్లెట్ ను ఉప‌యోగించేట‌ప్పుడు కంటిపై త‌క్కువ ప్ర‌భావం ప‌డుతుంది.


మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెస‌ర్ పై ఈ ట్యాబ్లెట్ ప‌నిచేయ‌నుంది. 4 జీబీ వ‌ర‌కు ర్యామ్, 64 జీబీ వ‌రకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


డాల్బీ అట్మాస్, హై రిజ‌ల్యూష‌న్ ఆడియో టెక్నాల‌జీలు కూడా ఇందులో ఉన్నాయి. వీడియో కాల్స్, ఆన్ లైన్ కాన్ఫ‌రెన్స్ ల స‌మ‌యంలో నాయిస్ క్యాన్సిలేష‌న్ ఎనేబుల్ చేయ‌డానికి ఇందులో రెండు మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి.


దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 7100 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది స‌పోర్ట్ చేయ‌నుంది. ఓటీజీ కేబుల్ ను కూడా ఇది స‌పోర్ట్ చేయ‌నుంది. దీని మందం 0.69 సెంటీమీట‌ర్లు కాగా, బ‌రువు 440 గ్రాములుగా ఉంది.