శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 స్మార్ట్ ఫోన్ దక్షిణకొరియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇతర దేశాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ పేరుతో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే అందించారు. 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 4,49,900 వాంగ్ లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.28,200) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ వైడ్ 5 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వీ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉండనున్నాయి.
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
దీని మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 203 గ్రాములుగానూ ఉంది. SM-E426S మోడల్ నంబర్ తో ఈ ఫోన్ లాంచ్ అయింది. SM-E426B మోడల్ నంబర్ తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ రానుందని గతంలో వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ ఫోనే గెలాక్సీ ఎఫ్42 5జీగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో రూ.20 వేలలోపు ధరతోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: జియో ఫోన్ సేల్ వాయిదాకు కారణం ఇదే.. ల్యాప్‌టాప్‌ల రేట్లు పెరిగే అవకాశం!
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
Also Read: గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ రియల్ మీ ఫోన్ పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.6 వేల వరకు!