బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ రిటైల్ ట‌చ్ పాయింట్ల జాబితాలో రెండు కొత్త న‌గ‌రాలు కూడా చేరాయి. అంటే మ‌రో రెండు న‌గ‌రాల్లో కూడా బ‌జాజ్ చేత‌క్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం అయింద‌న్న మాట‌.


అవే చెన్నై(త‌మిళ‌నాడు), హైద‌రాబాద్(తెలంగాణ‌) న‌గ‌రాలు. హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి, కాచిగూడ లొకేష‌న్ల‌లో దీనికి సంబంధించి డీల‌ర్ల‌ను అసైన్ చేసిన‌ట్లు బ‌జాజ్ ప్ర‌క‌టించింది. చెన్నైలో కొల‌త్తూర్, అన్నా స‌లై లొకేష‌న్ల‌లో ఈ స్కూట‌ర్ ను బుక్ చేసుకోవ‌చ్చు.


తెలంగాణ‌, త‌మిళ‌నాడు మాత్ర‌మే కాకుండా.. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల్లో కూడా ఈ స్కూట‌ర్ అందుబాటులో ఉంది. త‌న మొద‌టి బ్యాట‌రీ స్కూట‌ర్ ద్వారా బ‌జాజ్ మెల్ల‌గా త‌న రీచ్ ను పెంచుకుంటోంది. 2022 నాటికి మొత్తంగా 22 భార‌తీయ న‌గ‌రాల్లో ఈ స్కూట‌ర్ ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.


Also Read: గుడ్ న్యూస్.. ఈ బ‌డ్జెట్ రియ‌ల్ మీ ఫోన్ పై భారీ ఆఫ‌ర్.. ఏకంగా రూ.6 వేల వ‌ర‌కు!


ఈ కొత్త బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అర్బ‌న్, ప్రీమియం వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో అర్బ‌న్ వేరియంట్ ధ‌ర రూ.1.42 ల‌క్ష‌లు(ఎక్స్-షోరూం) కాగా, హైఎండ్ అయిన‌ ప్రీమియం వేరియంట్ ధ‌ర రూ.1.44 ల‌క్ష‌లుగా(ఎక్స్-షోరూం) ఉంది.


ఇందులో 3.8కేడబ్ల్యూ మోటార్ ను అందించారు. నాన్ రిమూవ‌బుల్ 3కేడ‌బ్ల్యూహెచ్ ఐపీ67 లిథియం-ఇయాన్ బ్యాట‌రీ ప్యాక్ ను ఇందులో అందించారు. బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీట‌ర్లు కాగా, పూర్తిగా చార్జ్ పెట్టి ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తే 95 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌వ‌చ్చు. 5ఏ ప‌వ‌ర్ సాకెట్ ద్వారా ఇంట్లోనే దీన్ని చార్జింగ్ పెట్టుకోవ‌చ్చు.


ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, బ్లూటూత్ ఆప్ష‌న్ ఉన్న ఇన్ స్ట్రుమెంట్ క‌న్సోల్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫంక్ష‌నాలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్, ఏథ‌ర్ 450ఎక్స్, ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల నుంచి బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ గ‌ట్టి పోటీని ఎదుర్కోనుంది.


Also Read: OnePlus: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..
Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. ధ‌ర రూ.14 వేల‌లోపే.. రియ‌ల్ మీ సూప‌ర్ ట్యాబ్లెట్!
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వ‌చ్చేస్తున్నాయి.. ఈసారి మ‌రిన్ని కొత్త రంగుల్లో!