‘బాహుబలి’తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ట్రిపుల్ ఆర్.. ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. ముందుగా 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జనవరి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. చివరిగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. ఈ విషయం ఎప్పటినుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ తాజాగా రాజమౌళి అండ్ టీం అఫీషియల్‌గా ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ అన్ని ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చెయ్యని కారణంగా అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ న్యూ రిలీజ్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు. దానితో ఆర్.ఆర్.ఆర్ దసరా బరి నుంచి అఫీషియల్ గా తప్పుకున్నట్టే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
వాస్తవానికి వాయిదాల మీద వాయిదాలు పడకుండా రాజమౌళి సినిమా రిలీజయ్యే ఛాన్సే లేదని ప్రేక్షకులు ఫిక్సైపోయారు. గతంలో ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాల షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. పైగా చెక్కుడు కార్యక్రమంలో రాజమౌళిని మించిన వారు లేరనే ఉద్దేశంతోనే జక్కన్న అనే పేరు ఫిక్స్ చేసేశారు. కానీ ఇప్పుడు జక్కన్న చెక్కడం కామన్ కారణం అయినా... అంతకుమించిన మరో కారణం కరోనా. ఏదేమైనా ‘RRR’ వాయిదా అన్నది క్లారిటీ వచ్చేసింది. మళ్లీ విడుదల తేదీ కోసం సినీ ప్రియులు ఎదురుచూడాల్సిందే.
Alos Read:తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు
Also read:తెలుగు సినిమా హీరోలకు బైకులంటే ఎందుకంత మోజు..
Also Read: సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ
Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..