సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని..అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. దీంతో అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. వీటిపై స్పందించిన చిరంజీవి అభిమానులెవరూ కంగారు పడొద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు.
ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారన్నారు. ఇంకా పలురు సినీ, రాజకీయ ప్రముఖులు తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేశారు..
ఎన్టీఆర్
దేవిశ్రీ ప్రసాద్
Wishing dear Brother @IamSaiDharamTej a very speedy recovery 🙏🏻🙏🏻❤️❤️
All our Love n Prayers with U Dear !! You wil be perfectly fine in no time ! 🎶🎶🤗🤗❤️❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 10, 2021
శ్రీనువైట్ల
రవితేజ
నిఖిల్
మనోజ్ మంచు
బండ్ల గణేష్
కార్తికేయ