సినిమాల్లో బైక్ స్టంట్స్ తో మెప్పించే హీరోలు, రియల్ లైఫ్ లో కూడా బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టపడుతుంటారు. ఈ ఇష్టమే కొన్నిసార్లు వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా ఇలా తాను ఇష్టపడ్డ స్పోర్ట్స్ బైక్ పై రైడ్ కి వెళ్లి తీవ్రగాయాలపాలయ్యారు. అసలు మన హీరోలకు బైక్ రైడింగ్ అంటే ఎందుకంత ఇష్టం..? ఎవరెవరికి ఎలాంటి బైక్స్ ఉన్నాయో చూద్దాం.



బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్  కాలంలో హీరో సైకిలెక్కి తిరిగే సన్నివేశాలు ఎన్నో. అయితే ఆ తర్వాతి తరం బైక్ లపై మోజు పెంచుకుంది. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున సినిమాల్లో బైక్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నాగార్జునకి స్పోర్ట్స్ బైక్ పై వెళ్లడం బాగా సరదా. వెంకటేష్ పాటల్లో బైక్ లపై చక్కర్లు కొడుతుంటారు. ఇటీవల లెజెండ్ సినిమాలో బాలకృష్ణ వాడిన బైక్ ఎంత సెన్సేషన్  అయిందో తెలుసుగా.




Also read:తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు


జనరేషన్ మారిన తర్వాత ఇప్పుడంతా ఇంపోర్టెడ్ బైక్స్ దే హవా. పవన్ కల్యాణ్ కి బైక్ లంటే పిచ్చి, ఆ ఇష్టమే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి కూడా వచ్చిందంటారు. హార్లే డేవిడ్ సన్ బైక్ ని తొలిసారిగా ఇంపోర్ట్ చేసుకున్న హీరోగా పవన్ అప్పట్లో వార్తల్లోకెక్కారు. పవన్ సినిమాల్లో ఇంపోర్టెడ్ బైక్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రియల్ లైఫ్ లో కూడా బైక్ రైడింగ్ అంటే పవన్ కి బాగా ఇష్టం. రాజకీయాల్లో బిజీ కాకముందు హైదరాబాద్ రోడ్లపై పవన్ తన  చక్కర్లు కొట్టొచ్చేవారని  టాక్.




హీరో ప్రభాస్ కి కూడా ఇంపోర్టెడ్ బైక్స్ అంటే బాగా ఇష్టం. మిర్చి సినిమాలో ప్రభాస్ బైక్ పై ప్రత్యేకంగా ఓ సీన్ కూడా పెట్టారు. ఇక సాహోలో రెబల్ స్టార్ బైక్ రేసింగ్, స్టంట్స్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ దగ్గర ప్రస్తుతం 6 రకాల వెరైటీ బైక్స్ ఉన్నాయట.


Also Read: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన బైక్ గురించి తెలుసా.. సరిగ్గా 5 నెలల క్రితం సుప్రీం హీరోనే..


బైక్ లంటే బాగా ఇష్టపడే మరో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఏపీలో తొలి హార్లే డేవిడ్ సన్ బైక్ ని సొంతం చేసుకున్న హీరో తారక్. ఫ్రీ టైమ్ లో హెల్మెట్ పెట్టుకుని తాను ఎవరనేది తెలియకుండా  హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు తారక్. ఎన్టీఆర్ వద్ద కూడా ఇంపోర్టెడ్ బైక్స్ ఉన్నాయి, ఇప్పుడాయన ఇంపోర్టెడ్ కార్లపై ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారు.



మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా సినిమాల్లో బైక్ స్టంట్స్ తో అదరగొడుతుంటారు. రియల్ లైఫ్ లో కూడా వీరికి బైక్స్ అంటే బాగా పిచ్చి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి బైక్ పై వెళ్లడానికి బాగా ఇష్టపడతారని సమాచారం. అల్లు హీరోస్ ఇద్దరి దగ్గర 5 కాస్ట్ లీ బైక్స్ ఉన్నాయట.



తెలుగు హీరోల్లో చాలామందికి బైక్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా సినిమాల్లోనే ఎక్కువగా వాటిపై తిరుగుతూ ఆ మోజు తీర్చుకుంటారు. రియల్ లైఫ్ లో వారు బయటకు రావడానికి సమయం దొరకదు, ఒకవేళ దొరికినా.. ఫలానా హీరో బైక్ పై బయటకొచ్చాడని తెలిస్తే అభిమానులు ఓ పట్టాన వదిలిపెట్టరు. అందుకే ఎవరి కంటా పడకుండా హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ రోడ్స్ పై హీరోలు చక్కర్లు కొడుతుంటారు. అప్పుడప్పుడు కెమెరాల కంటపడుతుంటారు.


Also read:సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు, ప్రమాదానికి కారణం అదే అన్న మాదాపూర్ ఏసీపీ


ఈ క్రమంలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ కుమారులిద్దరూ బైక్ యాక్సిడెంట్స్ లోనే చనిపోయారు. క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు కూడా హైదరాబాద్ రోడ్స్ పై స్పోర్స్ బైక్ పై రైడ్ కి వెళ్లి ప్రాణాలొదిలారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మరోసారి సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.