స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సమీక్ష నిర్వహించారు. అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాలపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడింట ఒక వంతు దుకాణాలను  మూసివేశామని సీఎం తెలిపారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.


Also Read: American Corner: ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్.. దేశంలో ఇది మూడోది.. ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్


మూడింట ఒక వంతు దుకాణాలు మూసివేత 


మద్యం నియంత్రణలో భాగంగా రేట్లు పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను, పర్మిట్‌రూమ్‌ల తొలగించామన్నారు. లిక్కర్‌, బీరు అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. లిక్కర్ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.


Also Read: AP RAKIA Arbitration : ఏపీపై రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ కేసులు ! అసలు వివాదాలేంటి ? బాక్సైట్, వాన్‌పిక్ పెట్టుబడులే కారణమా ?


ఇసుక ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


ఇసుకను నిర్దేశించిన రేట్ల కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వర్షాలు తగ్గగానే రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలని, సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ యాడ్స్ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. 


Also Read: AP Govt One Lakh Fine: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. రూ.లక్ష జరిమానా విధింపు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి