అమెరికాలో భర్త, అత్తమామలతో నివసిస్తోంది ఓ మహిళ. ఆమె పేరు నెలీ బూ. నెలీ టిక్ టాక్ లో ‘మేడమ్ కాసర్’ అనే పేరుతో వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తుంది. తాజాగా ఆమె ‘గ్రాండ్ పేరెంట్స్ ఫ్రీజర్ డిస్కవరీ’ అనే పేరుతో ఓ వీడియో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. మనదేశంలో టిక్ టాక్ పై నిషేధం ఉంది కాబట్టి, మనం దాన్ని చూడలేం. కానీ సారాంశం మాత్రం తెలుసుకోవచ్చు.
నెలీ తాత అమ్మమ్మలకు ఓ ఫ్రీజర్ ఉంది. అది యాభై ఏళ్లనాటిది. అప్పట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయా అని సందేహం వచ్చిందా? ఫ్రీజర్ ను 1940లలోనే కనిపెట్టారు. కాస్త డబ్బున్న వాళ్లు అప్పట్లో వాటిని వాడేవారు. అలా 1972 నుంచి నెలీ గ్రాండ్ పేరెంట్స్ రకరకాల ఫుడ్ ను కొని దాచుకునేవారు. అలా వారు కొన్న ప్రతి ఫుడ్ కంటైనర్ పైన వాటిని కొన్న తేదీ కూడా ఉంది. అలా వారు కొన్నింటిని తిని, కొన్ని వదిలేసే వారు. ఇప్పటికీ 1972లో, 1980లలో, 1990లలో కొన్న చాలా పదార్థాలు ఫ్రీజర్ లో గడ్డకట్టిన పరిస్థితుల్లో అలా ఉండిపోయాయి. అవే ఇప్పుడు వైరల్ గా మారాయి.
నెలీ వయసైపోయిన తాత అమ్మమ్మలకు సాయం చేద్దామని వెళ్లింది. ఫ్రీజర్ ను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపోయింది. 1972 నాటి బ్లాక్ బెర్రీలు, 1983 నాటి బ్లూ బెర్రీలు, 1999 నాటి రాస్పెబెర్రీలు, కాస్త మాంసం ఇలా చాలా ఫుడ్ కంటైనర్ లు బయటపడ్డాయి. 1998నాటి 13 గుడ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే అమెరికా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆశ్చర్యపోతుంటూ, మరికొందరు వాంతి వస్తోందంటూ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ నెలి వాటిని ఏం చేసిందనే సందేహం మీకు వస్తోంది కదూ... ఆ పదార్థాలను డీ ఫ్రాస్ట్ చేసి, పడేసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Also read: పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Also read: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి
Also read: స్నానం చేయని భార్యతో కలిసుండలేను.. విడాకులు కోరిన భర్త
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం