ప్రముఖ నటుడు సిద్ధార్థ్ కు లండన్ లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సినిమాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ ఆ తరువాత జోరు తగ్గించాడు. అతడి సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ కి వెళ్లి అక్కడే సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి 'గృహం' అనే సినిమారూపొందించాడు. దీని తరువాత మళ్లీ సిద్ధార్థ్ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఆయనకి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. 


Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: నిదానంగా సాగినా.. నిరాశపరచదు!


అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ ను కూడా హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు సిద్ధార్థ్. దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానంద్, హీరోయి అను ఇమ్మాన్యుయేల్ తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. 


దీంతో ఆయన ఈవెంట్ కి ఎందుకు రాలేదా అనే సందేహాలు మొదలయ్యాయి. సిద్ధార్థ్ రాకపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించాడు దర్శకుడు అజయ్ భూపతి. సిద్ధార్థ్ ఆపరేషన్ కోసం లండన్ కి వెళ్లారని.. అందుకే ఈ ఈవెంట్ కి హాజరుకాలేకపోయారని అజయ్ తెలిపాడు. అయితే అది దేనికి సంబంధించిన ఆపరేషన్ అనే విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిద్ధార్థ్.. అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవాడు. కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆయనకు జరిగే ఆపరేషన్ సక్సెస్ కావాలని.. ఆరోగ్యంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. 


Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!


Also Read: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ


Also Read: సమంతని ఫాలో అవుతున్న చైతు.. ఈ టైమ్‌లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో!


Also Read: అర్థపావు భాగ్యం పెద్ద మనసు..బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ఏం చెసిందో తెలుసా...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి