సినీ సెలబ్రిటీల్లో ప్రేక్షకులకు తెలియని ఒక గొప్ప మనసు దాగి ఉంటుందన్న విషయం అప్పుడప్పుడూ వెలుగుచూస్తూనే ఉంటుంది. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోనూసూద్ కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సోనూ మంచి మనసుగురించి తెలిసన తర్వాత తనని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడాలంటేనే ప్రేక్షకులకు నచ్చడం లేదు. అయితే సోనూ మాత్రమే కాదు చాలామంది సెలబ్రెటీలు తమకు తోచిన సాయం అందించారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు తమలో మంచి తనాన్ని చాటుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి రెండో వారం ఎలిమిమేట్ అయిన ఉమాదేవి కూడా ఓ చిన్నారికి అండగా నిలిచింది. 


Also Read: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ


అంతకు ముందు కార్తిక దీపం సిరియల్ లో భాగ్యంగా  ఉమ బాగా ఫేమస్. ఈ సీరియల్ లో ఉమాదేవి అర్థపావు భాగ్యంగా నవ్వులు పూయిస్తోంది. సీరియల్ ఆరంభంలో సవతి తల్లిగా విశ్వరూపం చూపినా ఇప్పుడు కన్నతల్లికి మించి అనేంతలా మారింది. ఈ సీరియల్ మొత్తానికి మంచి కామెడీ క్యారెక్టర్ ఆమెది. వాస్తవానికి ఉమాదేవి కన్నా అర్థపావు భాగ్యం అంటేనే అందరికీ అర్థమవుతుందంటే ఆ క్యారెక్టర్ తో అంత పాపలర్ అయింది భాగ్యం. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో హౌస్ లో అడుగుపెట్టిన ఉమాదేవి షోలో ఉన్నది రెండు వారాలే అయినా గడగడ వణికించింది. నామినేషన్స్‌ వస్తే చాలు  పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.  సందర్భం ఏదైనా సరే మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బిహేవ్ చేసింది ఉమా. బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్లు అందరితో ఏదో సంద్బంలో పేచీ పెట్టుకుని  గయ్యాళి గంప అనిపించుకుంది. అందుకే నామినేషన్లలో చేరి రెండోవారం ఎలిమినేట్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా హమ్మయ్య అనుకున్నారు కానీ ఇప్పుడు ఉమా చేసిన పని గురించి తెలిసి అయ్యో మళ్లీ హౌస్ లోకి వెళితే బాగుండును అంటున్నారు. 
Also Read: సామ్ ని ఫాలో అవుతున్న చైతూ...ఇలాంటి టైమ్ లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు..


బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్ ను ఓ మంచి పని కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది ఉమాదేవి.  తనకు వచ్చిన  పారితోషికంలోని కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోవాలనుకుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు  అర్థపావు భాగ్యం నోరే కాదు మనసు కూడా పెద్దదే అంటున్నారు. ఓ చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని  కోరుకుంటున్నారు. ఏదేమైనా  మనిషి మనస్తత్వం రెండు మూడు వారాల్లో ఓ గంట పాటు ప్రదర్శితమయ్యే షో ద్వారా తెలిసిపోదని మరోసారి రుజులు చేసింది ఉమాదేవి.  బిగ్ బాస్ షోలో భాగంగా మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. ఇక రెండవ వారంలో తక్కువ ఓట్లు రావడంతో ఉమాదేవి బయటకు వచ్చింది.  


Also Read:అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్


Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి