శర్వానంద్, సిద్ధార్థ నటిస్తున్న ‘మహా సముద్రం’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ట్రైలర్‌ను పూర్తిగా ఇంటెన్స్ సన్నివేశాలతో నింపేశారు. ఇప్పటికే సినిమా మీద ఉన్న ఆసక్తిని మరింత పెంచే విధంగా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.



 


ట్రైలర్ మొదలవడమే సముద్రం విజువల్స్‌తో ఓపెన్ అవుతుంది. తర్వాత తల మీద రక్తంతో, చేతిలో సిగరెట్‌తో రోడ్డు మీద శర్వానంద్ కనిపిస్తాడు. ‘సముద్రం చాలా గొప్పది మామా.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది’ అనే డైలాగ్ శర్వా వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్‌తో వినిపిస్తుంది.


శర్వానంద్, సిద్ధార్థ, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్, జగపతిబాబు, రావు రమేశ్, శరణ్య.. ఇలా కీలక ఆర్టిస్టులందరినీ ట్రైలర్ చూపించి సినిమా మీద ఆసక్తి పెంచుతున్నారు. ఇంటెన్స్‌గా ప్రారంభమైన ట్రైలర్ మధ్యలో ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలతో రిలాక్స్ చేసి.. చివరికి మరింత ఇంటెన్స్‌గా ఈ ట్రైలర్‌ను ముగించారు.


Also Read: Samantha Naga Chaitanya: ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య


‘నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్లు కాదు అర్జున్’ అనే అదితిరావు హైదరి డైలాగ్‌తో తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చారు. ‘నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్ని నదులూ కోరుకుంటాయి’ అనే అను ఇమ్మాన్యుయెల్ డైలాగ్‌తో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. అయితే అర్జున్ పాత్ర పోషించింది.. శర్వానా, సిద్ధార్థనా అన్నది తెలియరాలేదు.


ట్రైలర్ చివరిలో ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’ అంటూ సిద్ధార్థ ఇంటెన్స్‌తో చెప్పే డైలాగ్‌తో తన పాత్ర డెప్త్ ఎంతో చెప్పే ప్రయత్నం చేశారు. చివరిలో అదితిరావు హైదరిపై సిద్ధార్థ్ గన్ పెట్టే ఫ్రేమ్‌తో ట్రైలర్‌ను ముగించి ఆర్ఎక్స్100 టచ్ ఇచ్చారు. కేజీఎఫ్ ఫేం ‘గరుడ రామ్’ కూడా ఇందులో కీలక విలన్ పాత్ర పోషించాడు.


ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్‌లో నేపథ్య సంగీతం కూడా సినిమాను మరింత ఇంటెన్స్‌గా మార్చింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా చూడాలంటే మాత్రం అక్టోబర్ 14వ తేదీ వరకు ఆగక తప్పదు మరి!


Also Read: Dookudu: బంగారంతో ‘దూకుడు’ లాకెట్.. శ్రీనువైట్లకు నిర్మాత ఊహించని గిఫ్ట్


Also Read: హీరోయిన్‌గా వాణీ విశ్వనాథ్ కూతురు.. హీరో ఆయన కొడుకే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి