ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీలో పాత్ర మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలే కాక, సమాజం కూడా బాగోలేదని అన్నారు. అయితే ఏపీ కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను వదిలిపెట్టి తాను చాలా నష్టపోయానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపీని వదిలేసి తాను తెలంగాణకు వస్తానని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.
Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. ముగిసిన బీఏసీ భేటీ, కాంగ్రెస్ కొత్త డిమాండ్
రాయల తెలంగాణ కోసం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌తో శాసనసభ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి కలిసి పలు అంశాలపై మాట్లాడారు. అంతకు ముందు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతో జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేత జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్న ఆయన... తనకు జానారెడ్డి మంచి మిత్రుడని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్న ఆయన రాజకీయాలు బాగోలేవని, సమాజం కూడా బాగోలేదన్నారు. ఏపీ వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయామన్నారు. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని జేసీ వ్యాఖ్యానించారు.
Watch Video : జేసీ Vs కేతిరెడ్డి.. దశాబ్దాల తా'ఢీ'పత్రి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
తెలంగాణతో కలిసి ఉంటే
అనంతరం విలేఖరులతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన తాను రాజకీయంగా ఎదిగింది కాంగ్రెస్‌లోనే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు కలిశానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనతో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న ఆయన... రాయలసీమ కూడా తెలంగాణతో కలిసి ఉంటే బాగుండేదని కేసీఆర్‌తో చెప్పానని పేర్కొన్నారు.
Watch Video : అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? జేసీ ధ్వజం