బ్యాంక్ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్ న్యూస్ అందించింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 606 స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 18తో ముగియనుంది.

పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి మారుతున్నాయి. 23 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఫుల్‌ టైం ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హత వివరాలు తెలుసుకోవాలి. సంబంధిత విభాగంలో పని అనుభవంతో పాటు సాఫ్ట్‌ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. మరిన్ని వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Also Read: APPSC Jobs: ఏపీలో 151 ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. రూ.91 వేల వరకు వేతనం

నోటిఫికేషన్ల డైరెక్ట్ లింక్‌లు ఇవే.. 

నోటిఫికేషన్ 1: ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్) పోస్టుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
నోటిఫికేషన్ 2: మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
నోటిఫికేషన్ 3: ఇతర పోస్టుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

విభాగాల వారీగా ఖాళీలు.. 

విభాగం   ఖాళీల సంఖ్య  వేతనం
రిలేషన్‌షిప్ మేనేజర్    314 రూ.6,00,000 నుంచి రూ.15,00,000 వరకు వేతనం లభిస్తుంది
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్   217 రూ.2,00,000 నుంచి రూ.3,00,000 వరకు
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)    26 రూ. 48,170 బేసిక్ వేతనంతో మొత్తం రూ. 69,810 
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)    20 రూ.10,00,000 నుంచి రూ.28,00,000 వరకు
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్    12 రూ.12,00,000 నుంచి రూ.18,00,000 వరకు
మేనేజర్ (మార్కెటింగ్)    12 రూ.63,840 బేసిక్ వేతనంతో మొత్తం రూ.78,230
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్)    2 రూ.25,00,000 నుంచి రూ.45,00,000 వరకు
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)  2 రూ.7,00,000 నుంచి రూ.10,00,000 వరకు
ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్ ఆర్కైవ్స్)  1 రూ.8,00,000 నుంచి రూ.12,00,000 వరకు

Also Read: RRC Railway Recruitment 2021: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Also Read: SSC Recruitment 2021: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి